Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

Relatives Protests in national highway to pay money

ధర్మపురి: నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో కూలి పనికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందిన సంఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది. చిన్ననాడే తల్లి తండ్రిని కోల్పోయి, అక్క బావల వద్ద ఉంటున్న యువకుడి మృతితో ధర్మపురిలో విషాదం నెలకొంది. బందువుల, గ్రామస్థుల కథనం ప్రకారం… మండలంలోని రామయ్యపల్లె గ్రామానికి చెందిన దాసరి రాఖేష్(20) తల్లి తండ్రి శంకరమ్మ లక్ష్మన్‌లు అతని చిన్నతనంలోనే మృతి చెందడంతో, అదే గ్రామములో ఉంటున్న రాఖేష్ అక్క బావలైన కూస లావణ్య, వేణుల వద్ద ఉంట్టు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ధర్మపురి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో నూతనంగా నిర్మాణం పనులు నడుస్తున్న గందే శ్రీనివాస్ ఇంట్లో సెంట్రింగ్ కూలి పని చేయడానికి రాఖేష్ శనివారం ఉదయం వచ్చాడు. ఇంటి ముందు ఉన్న ఇనుప సలిగెను ఇంట్లోకి తీసుకువెళ్లే క్రమంలో, ఇంటి మందు ఉన్న 11కెవి విద్యుత్ వైరుకు తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాఖేష్ బందువులు, గ్రామస్థులు ఘటన స్థలానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంటి యజమాని శ్రీనివాస్ నిర్లక్ష్యం వల్లే రాఖేష్ మృతి చెందాడని ఆరోపిస్తూ ఘటన స్థలంలో ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు మృతుని బందువులు ఆందోళన చేపట్టారు. ఇంటి సమీపంలో ఉన్న 11కెవి వైర్లకు పివిసి పైపులు తొడిగి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆరోపించారు. గతంలో ట్రాక్టర్‌తో మట్టిని పోస్తుండగా అదే వైరు తాకి మంటలు వచ్చాయని, పివిసి పైపులు తొడగాలని కాంట్రక్టర్ చెప్పిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడని బందువులు ఆరోపించారు. ఎంత సేపటికి ఇంటి యజమాని ఘటన స్థలానికి రాక పోవడంతో జాతీయ రహదారిపై రాస్తారోఖో చేపట్టారు. సాయంత్రం వేళల్లో ఘటన జరిగిన ఇంటి వద్దే కననం చేసేందుకు సిద్దం చేశారు. విషయం తెలుసుకున్న ధర్మపురి పిఎసిఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్, తెదెపా రాష్ట్ర నాయకులు గడ్డం బాస్కర్‌రెడ్డి యజమానితో రూ. 6లక్షలు నష్ట పరిహారం ఇప్పిస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాఖేష్ సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ధర్మపురి ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు.

Comments

comments