Search
Monday 19 November 2018
  • :
  • :

జియోకు పోటీగా రిలయన్స్.. దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాల్స్!

RCOM JIOన్యూఢిల్లీ : జియో సిమ్‌లు టెలికాం రంగంలో ప్రవేశించడంతో ఒక్కసారిగా ఇతర నెట్‌వర్క్‌లు డీలా పడిపోయాయి. కాల్స్, నెట్, ఎస్‌ఎంఎస్‌లు ఒకటి రెండు కాదు అన్ని సదుపాయాలు ఫ్రీగా అందించడంతో వినియోగదారులు అందరూ జియో వైపుకి మల్లారు. మిగితా టెలికాం సంస్థ ఆ తర్వాత ఎన్ని ఆఫర్లు ప్రకటించినప్పటికీ.. జియోకు వచ్చిన ఆదరణ మాత్రం తగ్గలేదు. కాగా ఇప్పుడు జియోకు ధీటూగా సమాధానం చెప్పేందుకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కొత్త ఆఫర్‌ను రూపొందించింది. దేశ వ్యాప్తంగా ఆర్‌కామ్ వినియోగదారులకు అపరిమిత కాల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు రూ.149 రీచార్జ్‌తో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పింస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. రూ.149 అన్‌లిమిటెడ్ ప్లాన్‌లో ఆర్‌కామ్ 2జి, 3జి, 4జి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. దేశ వ్యాప్తంగా లక్షలమంది ఇంకా 2జి నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. ఈ రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్ మాత్రమే కాదు 300 ఎంబి డేటాను కూడా వినియోగదారులు పొందవచ్చు అని ఆర్‌కామ్ ప్రకటనలో తెలిపింది.

Comments

comments