Home తాజా వార్తలు 28 ఏళ్ల కనిష్టానికి రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు

28 ఏళ్ల కనిష్టానికి రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు

Reliance

 

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్ల విలువ మరింత పడిపోయింది. ఉదయం సెషన్లో ఒకానొక దశలో షేర్ల విలువ 10% తగ్గి రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరుకుంది. గత 28 ఏళ్లలో షేరు విలువ రూ.52.70లకు చేరడం ఇదే తొలిసారి. రిలయన్స్ ఇన్ఫ్రా వార్షిక ఫలితాలపై తాము అభిప్రాయం వెల్లడించలేమన్న ఆడిటర్లు అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంపెనీ, అనుబంధ సంస్థల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో ఆ ప్రభావం షేర్ల మీద పడింది. 1991 ఫిబ్రవరి 1న ఈ కంపెనీ షేరు ఆ ధర వద్ద ట్రేడైంది.

అంతకు ముందు 1990 ఏప్రిల్ 12న కంపెనీ చరిత్రలోనే తొలిసారి షేరు విలువ రూ.35కు చేరింది. ఎన్ని సంక్షోభాలు ఎదుర్కుంటున్నప్పటికీ రూ.104 ఉన్న షేరు విలువ జూన్ మాసానికి రూ.49కి చేరుకుంది. 2018-19(2019 నాలుగో త్రైమాసికానికి) రూ. 3,301 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు ఆ కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం అనిల్ అంబానీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ ప్రభావం ఆయన సంస్థల మీదా పడుతోంది. దీంతో ఆడిటర్లు సైతం వార్షిక ఫలితాలను వెల్లడించడానికి ముందుకు రావడం లేదు. కంపెనీ మనుగడ పై కూడా ఆడిటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Reliance Infra shares at 28 year low