Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

టెలికాం రంగం జియోమయం

Reliance-Jioవాయిస్ కాలింగ్ కాకుండా డేటా ప్లాన్‌పైనే జియో ఫోకస్, 4జి డేటాకు మీరెంత చెల్లిస్తున్నారు?

ముంబయి: రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికామ్ రంగం ముఖచిత్రమే మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జియో ప్రకటించిన డేటా ప్లాన్‌లు భారత్ ఇంటర్నెట్‌లో విప్లవం తీసుకురానున్నాయి. టాక్ టైమ్, ఉచిత నిమిషాలు, కాల్ రేట్లు వంటి వాటిపై రిలయన్స్ దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా డేటా ప్లాన్‌పైనే జియో ఫోకస్ చేసింది. ఎస్‌టిడి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారితో వాయిస్ కాలింగ్‌ను జియో ఉచితంగా అందిస్తూ, వీటికి ఎలాంటి చెల్లింపులు అవసరం లేదని ప్రకటించింది. డేటా ఛార్జీల విషయానికొస్తే అత్యంత తక్కువ ఛార్జీ ఒక జిబి రూ.51లకే అందిస్తోంది. ఇంటర్నెట్ వినియోగానికి మాత్ర మే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ ధరలకే తాము మొబైల్ డాటా ప్యాకేజీలను అందజేయనున్నామని రిలయన్స్ జియో అధిపతి ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఇప్పటిదాకా ఎయిర్‌టెల్, ఐడియావంటి ఆపరేటర్లు ఇస్తున్న 2ఎంబిపిఎస్, 4 ఎంబిపిఎస్‌ల 4జి వేగాన్ని దాటి, 40ఎంబిపిఎస్ సరాసరి డౌన్‌లోడ్ వేగాన్ని జియో అందివ్వనుంది. జియో గురువారం చేసిన ప్రకటనతో ఎయిర్‌టెల్, ఐడియాలకు షేర్‌మార్కెట్లో వేల కోట్లలో నష్టాన్ని మిగిల్చింది.
తక్కువ ఛార్జీలు ఓకే సేవల నాణ్యత మెరుగవ్వాలి:సర్వే
రిలయన్స్ జియో దూకుడు ఛార్జీలతో ఇతర టెలికామ్ సంస్థలు బెంబేలెత్తి పోతుండగా, మార్కెట్‌లో ఒక ఆందోళనకర వాతావరణం నెలకొంది. ప్రజలు మాత్రం తక్కువ ఛార్జీలు బాగున్నాయ్ సరే, పోటా పోటీగా రేట్లను మరింతగా తగ్గిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ టెలికామ్ సంస్థలు సేవల నాణ్యతపై దృష్టి పెట్టడం లేదని, మెరుపర్చుకునేందుకు ప్రయత్నించడం లేదని ఓ సర్వే వెల్లడించింది. సిజిఎన్ ఎంగేజ్‌మెంట్ వేదిక లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం, ఇప్పటివరకు ఉన్న టెలికామ్ సంస్థలు సేవలు అధ్వాన్నంగానే ఉన్నాయని 43 శాతం అభిప్రాయం వ్యక్తం చేయగా, 27 శాతం మాత్రం వాయిస్ సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పారు. కాల్ డ్రాప్ విషయానికొస్తే తమ టెలికామ్ సంస్థలు యావరేజ్‌గానే ఉన్నాయని 53 శాతం సర్వేలో చెప్పారు. ఆపరేటర్ల సేవల నాణ్యతా అంశాలపై లోకల్ సర్కిల్ ఈ అధ్యయనం నిర్వహించింది. గత కొద్ది సంవత్సరాలుగా ట్రాయ్ కూడా సేవల మెరుగుదల విషయంలో అంతగా పనులు చేపట్టలేదని 77 శాతం పౌరులు అభిప్రాయ పడ్డారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే కాల్ రేట్లు భారత్‌లో అత్యంత తక్కువగా ఉన్నాయని 53 శాతం పౌరులు అభిప్రాయపడ్డారని సర్వే వెల్లడించింది. ఓ వైపు ప్రభుత్వం నెట్‌వర్క్‌లను మెరుగుపర్చుకోవాలని ఆపరేటర్లకు సూచిన్నప్పటికీ కంపెనీలు మాత్రమే మౌలికసదుపాయాలని మెరుగుపర్చుకునేందుకు అదనంగా ఇన్వెస్ట్ చేయడం లేదని సర్వే పేర్కొంది.

Comments

comments