Home తాజా వార్తలు రిలయన్స్ వినియోగదారులకు పండుగే పండుగ

రిలయన్స్ వినియోగదారులకు పండుగే పండుగ

Reliance-4gహైదరాబాద్: రిలయన్స్ సంస్థ 4జి సేవలను రిలయన్స్ జియో పేరుతో ప్రారంభించింది. సిడిఎంఎ కస్టమర్లను పెంచుకునేందుకు రిలయన్స్‌ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. సిడిఎంఎ కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే 4జి సేవలను అందించనుంది. ఇతర నెట్ వర్క్‌తో పోలిస్తే 94 శాతం తక్కువ ధరకే 4 జి సేవలు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. 93 రూపాయలకే 10జిబి 4జి సేవలు అందించాలని రిలయన్స్ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో మిగతా సంస్థలు కూడా తక్కువ ధరకే 4జి సేవల అందించనున్నట్లు సమాచారం. దీంతో రిలయన్స్ అందరికి 4జి సేవలు అందుబాటులోకి తీసుకరానుంది.