Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

జియో నుంచి మరో రెండు అదిరిపోయే ఆఫర్లు!

Jio

ముంబయి : ఇప్పటికే వినియోగదారులకు ఎన్నో ఉచిత ఆఫర్లు ప్రకటించిన రిలియన్స్ జియో తాజాగా మరో రెండు బంపరాఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. జియో ఉచిత సర్వీసులు మార్చి 31న ముగియనున్న తరుణంలో జియో ప్రైమ్ ప్లాన్‌తో ఏప్రిల్‌ 1 నుంచి టారిఫ్‌లను ప్రవేశపెట్టనుంది. ప్రైమ్‌ ప్లాన్‌లో సభ్యత్వానికి రూ.99 చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  ఆ తర్వాత రూ.303 రీఛార్జ్ తో అపరిమిత కాల్స్, రోజుకు 1జిబి డేటాను అందిస్తుంది.

కాగా తాజాగా జియో మరో రెండు టారీఫ్ లను ప్రవేశపెట్టింది. రూ.149 ప్లాన్ తో రీచార్జ్ చేసుకున్న వారికి ఉచితంగా అపరిమిత కాల్స్ తో పాటు, 2జి డేటాను అందించనుంది. కాగా రూ.499తో రీచార్జ్ చేసుకొనే వారికి  ఉచితంగా అపరిమిత కాల్స్ తో పాటు, రోజుకు 2 జిబి 4జి డేటాను అందిస్తున్నట్లు జియో ప్రకటించింది.

Comments

comments