Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

జియో ఫ్రీ ఆఫర్ నవంబర్ వరకు పొడిగింపు..!?

Jio-Offer-Extends

ముంబయి : కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ ఇలా అన్ని సర్వీసులు ఫ్రీగా ప్రకటించి అతి తక్కవ సమయంలోనే దాదాపు 70 మిలియన్ల వినియోగదారులు చేరిన టెలికాం నెట్ వర్క్ గా ‘జియో’ చరిత్ర సృష్టించింది. గతేడాది సెప్టంబర్ లో ప్రారంభమైన జియో తొలుత డిసెంబర్ 31 వరకు ఉచిత సర్వీసులు ప్రకటించినా.. ఆ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో ఫ్రీ ఆఫర్లను మార్చి 31 వరకు పొడిగించింది. కాగా ఇప్పటికే దాదాపు ఆరు నెలల పాటు ఈ ఫ్రీ సర్వీసులు అందించిన జియో వీటిని మరికొన్ని నెలలు పొడిగించే యోచనలో ఉన్నట్లు సమచారం. ఓ ఆంగ్ల వెబ్ సైట్ కథనం ప్రకారం జియో ఈ ఉచిత సర్వీసులను నవంబర్ వరకు అందించే పనిలో పడిందటా..

ప్రస్తుతం నడుస్తున్న హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ లో వినియోగదారులకు పూర్తి ఉచితంగా కాల్స్, రోజుకు 1జిబి 4జి డేటా (1 జిబి దాటాక,  128Kbps స్పీడ్ తో) ఇస్తుంది. అయితే ఈ ఆఫర్ నవంబర్ పొడగించి… నెలకు  రూ.100 రీఛార్జ్ తో కాల్స్, డేటా అందించాలని సంస్థ అనుకుటుందటా.. ఒకవేళ నిజంగానే జియో ఈ ఆఫర్ ను పొడిగిస్తే మిగితా టెలికాం కంపెనీలకు పెద్ద సమస్యగానే మారుతుందని చెప్పకోవచ్చు. ఇక ఒక వెయ్యి రూపాయిల స్వల్ప ధరకే 4జి ఫోన్ ను కూడా త్వరలో మార్కెట్ లోకి ప్రవేశపెట్టేందుకు జియో సిద్ధమైన విషయం తెలిసిందే.

Comments

comments