Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

జియో మరో బంపర్ ఆఫర్…

Jio-Football-Offer

ముంబయి: అనతికాలంలోనే విశేష ఆదరణ పొందిన రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను తీసుకొస్తుంది. తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్న వినియోగదారులు మొదటిసారి జియో నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేసుకుంటే ఫుట్‌బాల్ ఆఫర్ వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ ఆఫర్ కింద రూ. 2,200 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. రూ. 50 చొప్పున 44 క్యాష్‌బ్యాక్ వోచర్లను ఇస్తామని సంస్థ ప్రకటించింది. శాంసంగ్, నోకియా, మైక్రోమ్యాక్స్, షావోమి, ఆసుస్, ప్యానాసోనిక్, మోటోరోలా, ఎల్‌జి, హువావే డివైజ్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఫుట్‌బాల్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. జియో కస్టమర్లు రూ. 198, 299తో రీచార్జి చేసుకుంటే 44 జియో వోచర్లు మైజియో అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయని చెప్పింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని జియో స్పష్టం చేసింది.

Reliance Jio Football Offer Gives Rs. 2,200 Cashback on New Smartphones.

Comments

comments