Home టెక్ ట్రెండ్స్ త్వరలో జియో 4జి ఫీచర్ ఫోన్.. ధర చాలా చౌక?

త్వరలో జియో 4జి ఫీచర్ ఫోన్.. ధర చాలా చౌక?

Jio-4G-Feature-Phone

ముంబయి: ఉచిత ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాల్స్ ఇలా అన్నీ ఫ్రీ.. ఫ్రీ.. అంటూ అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను ఆకర్షించింది రిలయన్స్ జియో. దీంతో ఇతర టెలికాం సంస్థలు ఆత్మరక్షణలో పడ్డాయి. తమ కస్టమర్లను కాపాడుకోవడానికి నానాఅవస్థలు పడుతున్నాయి. అయినా జియోకు మాత్రం పోటీగా నిలువలేకపోతున్నాయి.

ఇది చాలాదంటూ ఇప్పుడు జియో 4జి ఫీచర్ ఫోన్ పేరిట మరో సంచలనానికి నాంది పలుకుతోంది. చాలా రోజులుగా జియో 4జి ఫీచర్ ఫోన్‌కు సంబంధించిన వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కాని ఆ ఫోన్ ఎప్పుడు విడుదలవుతుంది? ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? ధర ఎంత? అనే విషయాల్లో మాత్రం స్పష్టత లేకపోయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం జియో 4జి ఫీచర్ ఫోన్ ఈ నెల 21న విడుదల కానుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇదే రోజు ముంబయిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం జరగనుందట. దీనిలో భాగంగానే ముఖేష్ అంబానీ జియో 4జి ఫీచర్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్ ధర కూడా ముందుగా వార్తల్లో వచ్చినట్టు రూ. 1500లకు కాకుండా కేవలం రూ. 500లకే కంపెనీ విక్రయించనుందని ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. అయితే ఈ వార్త జియో ప్రియులకు ఒకింత సంతోషాన్ని ఇచ్చేదనే చెప్పాలి.