Home బిజినెస్ జియో గిగా ఫైబర్ రిజిస్ట్రేషన్ షురూ…

జియో గిగా ఫైబర్ రిజిస్ట్రేషన్ షురూ…

Reliance jio opened another sensation

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీసింది. జియో ఫోన్2, గిగా ఫైబర్ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఎంపిక చేసిన పట్టణాల్లో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత జియో ఫిక్స్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌ను కంపెనీ అందించనుంది. దీనిని ఇళ్లు, వ్యాపారులు, చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, పెద్ద సంస్థల కోసం ఏకకాలంలో 1,100 పట్టణాల్లో ప్రారంభించనున్నారు. కంపెనీ తెలిపిన ప్రకారం, జియో గిగాఫైబర్ సేవలను ఒక జిబిపిఎస్(గిగాబైట్ పర్ సెకండ్)కు ఇంటర్నెట్ వేగం ఉండనుంది. ఆసక్తి కల్గినవారు జియో గిగాఫైబర్ కోసం జియో వెబ్‌పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ప్రాంతాల్లో తొలి బ్రాడ్‌బ్యాండ్ సేవలు పొందుతాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు. కస్టమర్లకు 1 జిబిపిఎస్ వరకు స్పీడ్ అందించడమే జియో లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి దీనిపై ఆసక్తి చూపుతూ మాత్రమే కస్టమర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కువ మంది ఆసక్తి చూపారో ముందు ఆ ప్రాంతాల్లో గిగా ఫైబర్ సేవలను సంస్థ ప్రారంభించనుంది.

జియో గిగాటివి
గిగాఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్‌లో భాగంగా జియో డిజిటల్ టెలివిజన్ కం టెంట్ సేవలు ఉంటాయి. జియో యాప్ సూట్ యాక్సెస్‌తో పాటు ఇంటర్నెట్ ఆధారిత డిజిటల్ కంటెంట్ సేవలను గిగాటివి సెట్‌టాప్‌బాక్స్ ఆఫర్ చేస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే సెట్‌టాప్‌బాక్స్ వీడియో కాలింగ్ ఫీచర్‌కు కూడా సఫోర్ట్ చేస్తోంది. ఇది టెలివిజన్ నుంచి వినియోగదారులకు వీడియో కాల్స్‌కు సపోర్ట్ చేస్తుంది. గిగాటివి రిమోట్ వాయిస్ ఆధారితంగా ఉంటుంది.

రిజిస్టర్ చేసుకోండి ఇలా..
1 జియో అధికారిక వెబ్‌సైట్ (https://gigafiber.jio.com/ registra tion)కు వెళ్లి అందులో గిగాఫైబర్ పేజ్ ఓపెన్ చేయండి
2 అక్కడ చేంజ్ బటన్‌పై నొక్కి మీ అడ్రెస్‌ను నింపాలి
3 ఆ తర్వాత సబ్‌మిట్ బటన్ కొడితే డీఫాల్ట్ అడ్రెస్ అని కనిపిస్తుంది. ఇది మీ ఇంటి చిరునామానా లేక ఆఫీస్ అడ్రెసా అనేది సెలెక్ట్ చేసుకోవాలి
4 తర్వాత వచ్చే పేజీలో మీ పేరు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఒటిపి బటన్ ప్రెస్ చేయాలి
5 మొబైల్‌కు వచ్చిన ఒటిపి సంఖ్యను ఎంటర్ చేసి మీ లొకాలిటీ (సొసైటీ, టౌన్‌షిప్, డెవలపర్‌లాంటివి) సెలెక్ట్ చేసి సబ్‌మిట్ కొట్టాలి
6 దీంతో జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్టే..

నేటి నుంచి జియో ఫోన్ 2
జియో ఫోన్2 ఫ్లాష్ విక్రయాలను నేటి నుంచి ప్రారంభించనున్నట్టు జియో ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభిస్తామని తెలిపింది. జియో.కామ్ వెబ్‌సైట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్ ప్రా రంభమవుతుందని, ఈ ఫోన్ కోసం బుధవారం నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. క్వార్టీ కీప్యాడ్‌తో ఉండే ఈ ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ యాప్స్‌ను కూడా అందిస్తున్నారు. జియోఫోన్ వినియోగదార్ల సంఖ్యను 10 కోట్లకు చేర్చడమే కంపెనీ లక్షంగా చేసుకుం ది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ జియో ఫోన్2, జియో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్(జియో గిగాఫైబర్), జియో డిజిటల్ టివి సర్వీసెస్(జియో గిగాటివిసెట్ టాప్ బాక్స్)లను ఆవిష్కరించారు. వీటితో పాటు జియో ఫోన్లను అప్‌గ్రేడ్ చేశామని చెప్పా రు. వాట్సాప్‌తో పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను జియో ఫోన్‌లో అందిస్తున్నామని ఆయన ప్రకటించారు.

పోన్ ఫీచర్లు ఇలా..
1 జియో ఫోన్ లాగే జియో ఫోన్ 2 కూడా కైయోస్ ఆధారిత 4జి వోల్ట్ ఆధారిత ఫీచర్ ఫోన్
2 అయితే పూర్తిగా క్వర్టీ కీబోర్డ్, విస్తృత హరిజంటల్ స్క్రీన్
3 240X320 పిక్సెల్ రిజల్యూషన్‌తో 2.4 అంగుళాల తెర
4 512 ఎంబి ర్యామ్
5 4జిబి ఇంటర్నల్ స్టోరేజ్
6 128జిబి ఎక్స్‌టర్నల్ మెమొరీ
7 కెఎఐ ఒఎస్, వైఫై, జిపిఎస్, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి, ఎఫ్‌ఎం
8 వెనుక 2 మెగాపిక్సెల్, ముందు వైపు విజిఎ కెమెరాలు
9 ఆగస్టు 15 నుంచి జియో ఫోన్‌లో వాట్సాప్, యూట్యూబ్
10 పాత జియో ఫోన్ ఇచ్చేసి రూ. 501 చెల్లించడం ద్వారా జియోఫోన్2
11 జూలై 21 నుంచి జియో ఫోన్2 కు మార్చుకునే అవకాశం
12 ఆగస్టు 15 నుంచి జియో ఫోన్2 కమర్షియల్ విక్రయాలు
13 2000ఎంఎహెచ్ బ్యాటరీ సామర్ధ్యం
14 జియో ఫోన్2కు ధర రూ. 2999గా నిర్ణయం