Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

జియో ఫోన్ల డెలివరీ ప్రారంభం

JIO-Phone

ముంబయి : టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో సంస్థ, కొద్ది రోజుల క్రితం అత్యంత చౌక ధరకే 4జి ఫీచర్ ఫోను ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.1500 చెల్లించి ఈ ఫోన్ పొందవచ్చని, మూడు నెలల తర్వాత ఆ ఫోన్ కోసం చెల్లించిన డబ్బులను రీఫండ్ గా పొందొచ్చని సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. దీంతో ఫోన్ కోసం పెద్ద ఎత్తున బుకింగ్ లు జరిగాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు జియో ఫోన్ డెలివరీ ప్రక్రియ ప్రారంభించింది. రూ.500 కట్టి ఈ ఫోన్ బుక్ చేసుకున్న వారు డెలివరీ సమయంలో రూ.1000 చెల్లించి ఫోన్ పొందవచ్చు. దేశ వ్యాప్తంగా దాదాపు 60 లక్షల ఫోన్లు బుకింగ్ అయినట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 15 రోజుల పాటు దీపావళీ కంటే ముందుగానే ఈ ఫోన్ ను వినియోగదారులకు చేరేలా చేస్తామని ఆయన తెలిపారు. ముందుగా గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు, ఆ తరువాత నగరాలకు ఈ ఫోన్లను డెలివరీ చేయనున్నామని వివరించారు. ప్రస్తుతం ఈ ఫోన్లను అన్నీ డెలివరీ చేశాక అక్టోబర్ నెల చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో మళ్లీ బుకింగ్స్ చేపట్టవచ్చని తెలిసింది.

జియో 4జి ఫోన్ ఫీచర్లు : 

  • 2.4 అంగుళాల డిస్‌ప్లే,
  •  512ఎంబి ర్యామ్‌
  • 4జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 128జిబి ఎక్స్‌పాండబుల్‌ మెమోరీ
  • 2 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
  • ఫ్రంట్ విజిఎ కెమెరా
  • 2000 ఎంఎహెచ్‌ బ్యాటరీ

Comments

comments