Home టెక్ ట్రెండ్స్ త్వరలో రిలయన్స్ జియో డిటిహెచ్

త్వరలో రిలయన్స్ జియో డిటిహెచ్

Jio-SettopBox

న్యూఢిల్లీ: సంచలనాలకు కేంద్రబిందువైన రిలయన్స్ జియో డిటిహెచ్ సేవల్లోకి ప్రవేశిస్తోంది. జియో డిటిహెచ్ సెట్ టాప్ బాక్స్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. ఏప్రిల్ నుంచి కంపెనీ ఈ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే టెలికాం మా ర్కెట్లో దూసుకుపోతున్న జియో ఇక డిటిహెచ్ సేవల్లోనూ సంచలనాల ను సృష్టించనుంది. 360 పైగా చానళ్లను జియో టివి ఆఫర్ చేయనుం దని, వాటిలో 50 హెచ్‌డి ఛానల్స్ ఉంటాయని మార్కెట్ వర్గాలు పే ర్కొంటున్నాయి. అయితే జియో డిటిహెచ్ సెటాప్ బాక్స్ చిత్రాలు ఆన్ లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ సెటాప్ బాక్స్ లు యుఎస్‌బి పోర్టు, స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్, హెచ్‌డిఎంఐ, వీడియో, ఆడియో అవుట్ పుట్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సెట్‌టాప్ బాక్స్‌లతో పోలిస్తే జియోలో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.