Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

జియో కాయిన్ పుట్టుక వట్టిదే నమ్మకండి..!

jio-coin-image

ముంబయి: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో నూతన క్రిప్టోకరెన్సీని జియో కాయిన్ పేరిట వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని జియో యాజమాన్యం వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ నేతృత్వం వహించనున్నారని కూడా వార్తలు వచ్చాయి.  జియో కాయిన్ పేరిట గూగుల్ ప్లే స్టోర్‌లో చాలా యాప్స్ ఉన్నాయని, అలాగే పలు వెబ్‌సైట్లు ఉన్నాయని వాటితో జియోకు ఎటువంటి సంబంధం లేదని జియో ఒక ప్రకటన విడుదల తెలిపింది. ఎవరూ కూడా జియో కాయిన్, యాప్స్, సైట్లను నమ్మి అనవసరంగా సమస్యల్లో ఇరుక్కోవద్దని జియో సంస్థ హెచ్చరించింది.

Comments

comments