Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

పేలిన రిలయన్స్ జియో లైఫ్ 4జి మొబైల్

LYF-4G-Mobile-Explodedరిలయన్స్ జియో ప్రస్తుతం సృష్టిస్తున్న ప్రభంజనం ఎలాంటిదో తెలిసిందే. అయితే రిలయన్స్ జియో నుంచి వచ్చిన రిలయన్స్ లైఫ్ 4జి మొబైల్ ఒకటి పేలిపోయిందని తన్వీర్ సాధిక్ అనే యువకుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. దీంతో రిలయన్స్ ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు ఈ ఘటన కొంచెం ఇబ్బంది కలిగించేదనే చెప్పాలి. కాగా ఈ ట్వీట్‌పై జమ్మూ మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా స్పందించడంతో సోషల్ మీడియాలో వైరల్‌లా మారింది. సాధిక్ పేలిన లైఫ్ ఫోన్ చిత్రాలను సైతం ట్వీట్‌లో పోస్ట్ చేశాడు. తన కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని తెలిపాడు. అయితే  ఈ ఘటన  ఎక్కడ జరిగిందనేది తెలియరాలేదు.

Comments

comments