Home తాజా వార్తలు రికార్డు స్థాయి లాభాలు

రికార్డు స్థాయి లాభాలు

Relianceక్యూ4లో దుమ్మురేపిన రిలయన్స్ ఇండస్ట్రీస్
త్రైమాసిక నికర లాభం రూ.10,362 కోట్లతో 9.8 శాతం వృద్ధి
రిటైల్, టెలికామ్ వ్యాపారాల దన్ను
కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ

న్యూఢిల్లీ: నాలుగో త్రైమాసికంలో(జనవరిమార్చి) రిలయన్స్ ఇండస్ట్రీస్ అద్భుతంగా రాణించింది. 2019 క్యూ4లో సంస్థ నికర లాభం రూ.10,362 కోట్లతో 9.8 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ. 9,438 కోట్లుగా ఉంది. రిటైల్, టెలికామ్ వ్యాపారాల్లో మెరుగైన గణాంకాలు సంస్థకు కలిసివచ్చాయి. కంపెనీ ఆదాయం రూ.1,54,110 కోట్లతో 19.4 శాతం వృద్ధిని సాధించగా, గతేడాది ఇదే సమయంలో ఆదాయం రూ.1,29,120 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో(201819) రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఎన్నో మైలురాయిలను సాధించింది. రిలయన్స్ రిటైల్ రూ.లక్ష కోట్ల రెవెన్యూ మార్క్‌ను సొంతం చేసుకుంది. ఇక జియో 30 కోట్ల మంది కన్యూమర్లను దక్కించుకోగా, పెట్రోకెమికల్స్ వ్యాపారంలోనూ అత్యధిక గణాంకాలతో మంచి ఫలితాలను రాబట్టిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియా ఆపరేషన్ల నుంచి ఎగుమతులు రూ.51,295 కోట్ల నుంచి రూ.49,052 కోట్లకు అంటే 4.4 శాతం మేరకు తగ్గాయి. కంపెనీ రిటైల్ సెగ్మెంట్ రెవెన్యూ రూ.24,183 కోట్ల నుంచి రూ.36,663 కోట్లకు 51 శాతం పెరిగింది. రిటైల్ వ్యాపా రం నుంచి లాభం రూ.1,923 కోట్లతో 77 శాతం పెరగ్గా, అదే సమయంలో టెలికామ్ బిజినెస్ నుంచి కూడా రూ.2,665 కోట్లతో లాభం 78 శాతం వృద్ధిని సాధించింది. ప్రతి పది రూపాయల షేరుకు రూ.6.5ను ఆర్‌ఐఎల్ బోర్డు సిఫారసు చేసింది. కాగా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3.15 శాతం పెరిగి రూ.1,386 వద్ద స్థిరపడింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 గణాంకాలు
వార్షిక కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 39,588 కోట్లు (5.7 బిలియన్ డాలర్లు)
వార్షిక పిబిడిఐటి రూ .92,656 కోట్లు (13.4 బిలియన్ డాలర్లు)
రిటైల్ బిజినెస్ రెవెన్యూ రూ.100,000 కోట్లు దాటింది
డిజిటల్ సర్వీసెస్, రిటైల్ వ్యాపారం వార్షిక రెవెన్యూ, ఇబిఐటి దాదాపు రెట్టింపైంది
ఏడాదిఏడాది ఆధారంగా సంస్థ నికర లాభం రూ. 10,362 కోట్లతో 9.8 శాతం జంప్
ఆదాయం రూ .1,54,110 కోట్లు (22.3 బిలియన్ డాలర్లు), 19.4 శాతం పెరిగింది
పిబిడిఐటి రూ .24,047 కోట్లు (3.5 బిలియన్ డాలర్లు), 16.3% పెరిగింది
ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ రూ .13,858 కోట్లు (2.0 బిలియన్ డాలర్లు), 4.6 శాతం పెరిగింది
నగదు లాభం 6.1 శాతం పెరిగి రూ .16,349 కోట్లు నమోదైంది
నికర లాభం 9.8% పెరిగి రూ.10,362 కోట్లు

స్టాండలోన్
రెవెన్యూ 0.3 శాతం తగ్గి రూ.90,648 కోట్లు
ఎగుమతులు 4.4 శాతం క్షీణించి 49,052 కోట్ల రూపాయలు నమోదు
పిబిడిఐటి 3.4 శాతం పెరిగి రూ .16,587 కోట్లు నమోదైంది
ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ 4.8 శాతం తగ్గి 11,331 కోట్ల
నగదు లాభం 5.9 శాతం తగ్గి 11,651 కోట్ల రూపాయలు నమోదు
నికర లాభం 1.6 శాతం తగ్గి 8,556 కోట్ల రూపాయలు (1.2 బిలియన్ డాలర్లు)
త్రైమాసికానికి గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్(జిఆర్‌ఎం) $8.2 / బిబిఎల్

Reliance records another bumper quarter with Rs 10,362 crore net profit