Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

క్రికెటర్ షమీకి ఊరట

Mohammed-Shami

ఢిల్లీ : టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి ఊరట లభించింది. షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అతడి భార్య ఆరోపిస్తూ బిసిసిఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షమీపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజం కాదని బిసిసిఐ తేల్చింది. దీంతో షమీకి బి గ్రేడ్ వార్షిక ఒప్పందాన్ని కొనసాగించనున్నట్టు బిసిసిఐ తెలిపింది. దీంతో అతనికి ఏడాదికి రూ.3 కోట్లు దక్కనున్నాయి. ఐపిఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్‌కు ఆడటానికి కూడా బోర్డు అంగీకరించింది. షమీకి మొహమ్మద్ భాయ్ అనే వ్యక్తి సూచన మేరకు దుబాయ్‌లో పాక్‌కు చెందిన అలిష్బా అనే యువతి డబ్బులు ఇచ్చిందని షమీ భార్య హసీన్ ఆరోపించిన క్రమంలో బిసిసిఐ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

 Relief to Cricketer Shami in BCCI

Comments

comments