Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

జిఎస్ టి దిగొచ్చింది

Removal of women's sanitary pads

మహిళల పారిశుద్ధ ప్యాడ్‌లపై తొలగింపు

వ్యాక్యూమ్ క్లీనర్లు, ఫుడ్ గ్రైండర్లు, మిక్సీలు, హీటర్లు, డ్రైయర్లు, ఎసిలు, టివిలు, వాషింగ్ మెషీన్లు మున్నగువాటిపై పన్ను 28% నుంచి 18 శాతానికి తగ్గింపు
రూ. 1000 లోపు పాదరక్షలపై 12 నుంచి 5 శాతానికి తగ్గిన పన్ను

న్యూఢిల్లీ: అత్యధిక పన్ను శ్లాబ్‌లోని పలు వస్తువుల ను తక్కువ పన్ను పరిధిలోకి తీసుకు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి పీయూష్ గోయల్ చెప్పా రు. శనివారం ఇక్కడ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం అనంతరం గోయల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శానిటరీ నాప్‌కిన్స్‌ను జిఎస్‌టి పన్ను పరిధి నుంచి పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. అలాగే వెయ్యి రూపాయల విలువైన పాదరక్షలపై పన్నును 5 శాతానికి తగ్గించినట్లు కూడా ఆయన చెప్పారు. ఇంతకు ముందు శానిటరీ నాప్‌కిన్స్‌పై 12 శాతం జిఎస్‌టి ఉండేది. దీనిపై అన్ని వర్గాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఇప్పుడు వాటిపై పన్నును పూర్తిగా ఎత్తివేశారు. లిథియం అయాన్ బ్యాటరీలు, వాక్యూమ్ క్లీనర్లు, ఫుడ్ గ్రైండ ర్లు, మిక్సీలు, వాటర్ హీటర్లు, హెడ్ డ్రైయర్లు, హ్యాండ్ డ్రైయర్లు, పెయింటింగ్స్, వార్నిష్, వాటర్ కూలర్స్, ఐస్‌క్రీమ్ కూలర్లు, మిల్క్ కూలర్స్, పెర్‌ఫ్యూమ్స్, టాయిలెట్ స్ప్రేలను 28 శాతం పన్ను పరిధిలోంచి తొలగించి 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకు వచ్చినట్లు మంత్రి గోయల్ తెలిపారు. అదే విధంగా హ్యాండ్‌బ్యాగ్‌లు, జ్యుయలరీ బాక్స్‌లు, హ్యాండ్ మేడ్ ల్యాంపులు, అద్దాలతో పాటు మరికొన్ని ఇతర వస్తువులను 12 శాతం పన్ను పరిధిలో కి తీసుకు వచ్చినట్లు చెప్పారు. దిగుమతి చేసుకునే యూరియాపై జిఎస్‌టిని 5 శాతానికి తగ్గించారు. రాళ్లు, మార్బుల్స్, రాఖీలు, రాతితో చేసే దేవతా విగ్రహాలపై విధిస్తున్న పన్నును రద్దు చేస్తున్నట్లు కూడా మంత్రి తెలిపారు. కాగా, ఎసిలు, టివిలు, వాషింగ్ మిషన్లపై విధిస్తున్న 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గిస్తున్నట్లు గోయల్ తెలిపారు. రూ. 5 కోట్లలోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులు ప్రతి నెలా జిఎస్‌టి చెల్లించాలని, అయితే ప్రతి మూడు నెలలకు రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని గోయల్ చెప్పారు. ఇక 18 శాతం పన్ను పరిధిలో ఉన్న ఇథనాల్‌ను 5 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక అవసరాలకోసం కొనుగోలు చేసే వాహనాలు, వర్క్ ట్రక్స్‌ను18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. కాగా తగ్గించిన పన్ను ధరలు ఈ నెల 27నుంచి అమలులోకి వస్తాయి. తదుపరి జిఎస్‌టి కౌన్సిల్ సమావేశాన్ని ఢిల్లీలో ఆగస్టు4న నిర్వహిస్తారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార రంగంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు గోయల్ తెలిపారు.

Comments

comments