Home వార్తలు తొలగించిన సీన్లను తిరిగి జతచేస్తున్నారు

తొలగించిన సీన్లను తిరిగి జతచేస్తున్నారు

oopiri1ఒక కథను అనుకున్న తర్వాత దర్శకుడు దానిని తెరకెక్కించినప్పుడు సినిమా నిడివి కొన్నిసార్లు ఎక్కువై పోతుం ది. సాధారణంగా మన సినిమాల నిడివి ప్రకారం రెండున్నర గంటలు ఉండాల్సిన చిత్రం అరగంట, గంట ఎక్కువై పోవడం జరుగుతుంది. దీంతో ఎడిటింగ్ సమయం లో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సన్నివే శాలను తీసివేస్తుంటారు ఫిల్మ్‌మే కర్స్. సినిమా నిడివి ఎక్కువైతే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారని ఈవిధంగా చేస్తారు. కానీ సినిమా మంచి హిట్ అయితే అలా ఎడిట్ చేసిన కొన్ని సీన్స్‌ను మూడు, నాలుగు వారాల తర్వాత కలిపి ప్రేక్షకుల ముందు కు తీసుకువస్తున్నారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొద లైంది. ఇప్పుడు దర్శకని ర్మాతలు సినిమా సక్సెస్ లో భాగంగా ఈ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి నిర్మించిన చిత్రం ‘ఊపిరి’. మార్చి 25న విడుదలైన ఈ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి దూసుకుపోతోంది. నాగార్జున కెరీర్‌లో ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఆల్‌టైమ్ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచి సరికొత్త రికార్డును సాధించింది. ఇప్పటికీ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఈ చిత్రం 100 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో విడుదలకు ముందు ఎడిట్ ఏసిన కొన్ని సీన్స్‌ను అదనంగా కలుపుతున్నారు. ఈ నిర్ణయం వల్ల రిపీటెడ్ ఆడియన్స్ వస్తారని చిత్ర బృందం భావిస్తోంది. ఇటీవల కాలంలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిన ‘ఊపిరి’ ప్రేక్షకు ల ఆదరాభిమానాలతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ఇక గతంలో కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాల విషయంలో ఎడిట్ చేసిన సన్నివేశాలను తిరిగి జతచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శ కత్వంలో తెరకెక్కిన హిట్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఘన విజయం సాధించి రికార్డు కలెక్షన్లను సాధించింది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల ఆదరాభిమానాలను దృష్టిలో పెట్టుకొని ఫిల్మ్‌మేకర్స్ సినిమాలో బ్రహ్మానందం నటించిన కొన్ని సన్నివేశాలను కలిపారు. ఈ కొత్త సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించి సినిమా కలెక్షన్లు పెరగడా నికి దోహ దపడ్డాయి. కొరటాల శివ డైరెక్షన్‌లో Oopiri-images-done-in-ptsప్రభాస్ హీరోగా వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘మిర్చి’. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే ఓ మంచి సినిమాగా నిలిచింది. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 90 కోట్ల షేర్‌ను సాధించి అదరగొట్టింది. విడుదల తర్వాత సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని తొలగించిన రెయిన్ ఫైట్‌ను తిరిగి కలిపారు. ఈ ఫైట్ యూత్‌ను ఎంతగా నో ఎంటర్‌టైన్‌చేసింది. అలాగే కొరటాల శివ డైరెక్షన్‌లోనే మహేష్‌బాబు హీరోగా చేసిన చిత్రం ‘శ్రీమంతుడు’ విషయంలో కూడా జరిగింది. మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు చిత్రంగా ఇది నిలిచింది. సినిమా విడుదల తర్వాత అద్భుతమైన స్పందనను దృష్టిలో పెట్టుకొని తిరిగి కొన్ని సీన్స్ యాడ్ చేశారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం ‘టెంపర్’. ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ మంచి హిట్‌గా నిలిచిన ఈ చిత్రం విడుదల తర్వాత ఎడిట్ చేసి తొలగించిన సన్నివేశాలను తిరిగి జతచేయడం జరిగిం ది. అనంతరం ఈ సినిమాకు మరింత స్పందన లభిం చింది. అలాగే రామ్ హీరో గా స్రవంతి రవికిషోర్ నిర్మించిన ‘నేను శైలజ’ సినిమా విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. ఈవిధంగా గత కొంత కాలంగా మంచి విజయాలను అందుకున్న సినిమాల్లో తొలగించిన సన్నివేశాలను తిరిగి కలిపి ప్రేక్ష కుల ఆదరాభిమా నాలను చూరగొం టున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ కొత్త ట్రెండ్ సినిమాలకు మంచి కలెక్ష న్లు రావడానికి దోహదపడుతున్నాయి.