Home వార్తలు హీరోల కంటే రెండింతల పారితోషికం!

హీరోల కంటే రెండింతల పారితోషికం!

kangana‘హీరోలకన్నా మేమేం తక్కువ కాదు. నిజం చెప్పాలంటే వాళ్లకన్నా మాకే ఎక్కువ పారితోషికం ఇవ్వాలి. లేదంటే ఇద్దరికీ సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే’అని పలువురు హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు తరచుగా అంటూ ఉంటారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు దీపికా పదుకునే, ప్రియాంకాచోప్రా, హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు జెన్నిఫర్ లారెన్స్, ఎమ్మా వాట్సెన్‌లు అందరూ ముక్త కంఠంతో చాలా కాలంగా అంటున్న మాటలు ఇవి. ఇక హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లారెన్స్, ఎమ్మా వాట్సన్‌లు తమ మాట నెగ్గించుకొని ఇప్పుడు హీరోలతో సమానంగా పారితోషికం అందుకుం టున్నారు. ఇప్పుడు హాట్‌బ్యూటీ కంగనారనౌత్ ఆ స్థాయికి చేరుకోవడం విశేషం. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న కంగన నటించిన తాజా చిత్రం ‘రంగూన్’. విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం కోసం కంగన ఏకంగా 10 కోట్ల రూ.ల పారితోషికం తీసుకుంటోంది. అయితే విశేషమేమిటంటే సైఫ్, షాహిద్‌లకు ఒక్కొక్కరికి 5 కోట్లు మాత్రమే దక్కాయట. కంగనారనౌత్‌కు మాత్రం ఏకంగా 10 కోట్ల పారితోషికాన్ని అందజేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.