Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రేణుదేశాయ్ తెలుగులో రీ ఎంట్రీ..?

Renu desai confirms Tollywood re-entry?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకుబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను రేణు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. దాంతో రేణుపై పవన్ అభిమానులు ట్రోల్ చేయడం, వాటికి ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇదిలాఉండగా తాజాగా రేణు గురించి మరో వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.  అదే.. ఆమె మళ్లీ సినిమాలు చేయబోతున్నారని. దీనికి ఆమె నుంచి అవుననే సమాధానం వచ్చిందట. అయితే, ఈసారి నటిగా కాదట. తెరవెనుక రోల్ పోషించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అదీ కూడా టాలీవుడ్ లోనే. ఇటీవల ఆమె రీ ఎంట్రీకి సంబంధించిన వార్తలు బాగా వినిపించిన సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలకు కమిట్ అయినట్లు పుకార్లు వచ్చాయి.
అయితే ఆ వార్తలను ఎవ్వరూ నమ్మలేదు కూడా. దానికి కారణం పవన్ నుంచి విడాకులు తీసుకున్న చాలా కాలం తర్వాత మళ్లీ ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. మరి ఇలాంటి సమయంలో ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందంటే నమ్మడం కష్టమే కదా. కానీ, ఇలాంటి అనుమానాలకు తెర దించుతూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల్లో రీ ఎంట్రీపై రేణు క్లారిటీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఓ స్క్రిఫ్ట్ రెడీ చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి రైతుల బాధలను స్వయంగా అడిగి తెలుకోవాలనే ఆలోచనతో  త్వరలోనే ఆమె ఓ మారుమూల గ్రామానికి వెళ్లనున్నారట. అన్నదాతల కష్టాలు, వారికి ఉండే సమస్యలపై మరింత అవగాహనం చేసుకున్నాక పక్కాగా స్ర్కిఫ్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారట. ఆ తర్వాతే షూటింగ్ కి వెళ్లాలని అనుకుంటున్నట్లు ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి తెలుగులో తాను తీయబోయే ఈ చిత్రానికి స్ర్కిఫ్ట్ మాత్రమే అందిస్తారా? లేక దర్శకత్వ బాధ్యతలు కూడా ఆమెనే తీసుకోనున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే మూవీని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విషయం విదితమే.

Comments

comments