Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఎంగేజ్‌మెంట్ అయిపోయింది

rani-desai

పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తాజాగా విడుదల చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమధ్య  రెండో వివాహం గురించి చూచాయగా చెప్పిన రేణు తాజాగా తన ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్‌లో తెలియజేసింది. ఈ మేరకు తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణు చెయ్యేసిన ఫొటోను ఆమె పోస్టు చేయడం విశేషం. ఈ ఫొటోలో నిశ్చితార్థపు ఉంగరాలను గమనించవచ్చు. అయితే తన జీవిత భాగస్వామి ఎవరు అనే విషయాన్ని మాత్రం రేణు దేశాయ్ తెలియజేయలేదు. ‘తాను ఒంటిరిగా ఉంటున్నానని… పిల్లలను చూసుకోవడానికి ఓ తోడు అవసరం’ అని పేర్కొన్న రేణు కొద్ది రోజులుగా తనకు తోడు కోసం వెతుకుతోంది. ఇటీవలే ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫొటోను షేర్ చేసి ఓ మంచి కవితను రాసి పోస్ట్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్ అయినట్టు ఫొటోలను బయటపెట్టి సంచలనం సృష్టించింది. పవన్‌కళ్యాణ్‌తో విడిపోయాక రేణుదేశాయ్ ప్రస్తుతం పుణేలో పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి ఉం టోంది. ఇటీవలే తండ్రి పవన్‌ను కలిసేందుకు అకీరా విజయవాడకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిందనే విషయాన్ని బయటపెట్టడం సంచలనమైం ది. ఈ సందర్భంగా తన రెండో వివాహం విషయంలో మద్దతు తెలియజేసిన వారందరికీ రేణు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపింది.

Comments

comments