Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

సస్పెన్ష్.. కంటిన్యూస్…

Renu Desai raises curiosity on social media with a peek of her fiance

పుణే: జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ రెండో వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ వ్యక్తితో రేణుకు నిశ్చితార్థం కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే తాను పెళ్లి చేసుకుంటున్న వ్యక్తి ముఖం పూర్తిగా కనబడకుండా జాగ్రత్త పడింది. ఇక తాజాగా మరో ఫోటోను కూడా పోస్ట్ చేసిన రేణు. ఈసారి కూడా అతడి మొహాన్ని దాచి పెట్టింది. అయితే దీనికి కారణం.. రేణు పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు ప్రకటించిందో అప్పటి నుండి ఆమెపై సోషల్ మీడియాలో పవన్ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే తనకు కాబోయే భర్త వివరాలని రేణు ఇంకా గోప్యంగానే ఉంచుతోంది. పెళ్లి తర్వాతే తనకి కాబోయే భర్త మొహాన్ని రివీల్ చేస్తానని ఇప్పటికే  ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం రేణు కాబోయే భర్తతో కలిసి అమెరికా పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పెట్టింది. కాగా, తనకి కాబోయే భర్త గురించి పోస్ట్ పెట్టిన ప్రతీసారి పికె అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న విషయం తెలిసిందే. దీంతో తాజా పోస్ట్ పై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Comments

comments