Home తాజా వార్తలు రేణు దేశాయ్ రీ-ఎంట్రీ

రేణు దేశాయ్ రీ-ఎంట్రీ

సినిమాలకు దూరమైన మాజీ హీరోయిన్లు రీ-ఎంట్రీ ఇవ్వడం కామనే. పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అదే తరహాలో తెలుగు తెరపై మరోసారి మెరవడానికి సిద్ధమవుతున్నారు. ఆమె తెలుగులో చేసింది రెండు సినిమాలే. బద్రి, జానీ చిత్రాల్లో ఆమె నటించారు. ఆతర్వాత పవన్‌ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక 2014లో ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠి సినిమాకు రేణు దేశాయ్ దర్శకత్వం వహించారు. ఇదిలాఉండగా తాను రెండు కొత్త సినిమాలకు సంతకం చేశానని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నానని ఆమె తెలిపారు. ఈ చిత్రంలో తాను సామాజికవేత్త, రచయిత హేమలత లవణం పాత్రలో నటిస్తానని చెప్పారు. వెండితెరపై ఆమె పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నానని… త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని రేణుదేశాయ్ అన్నారు. అయితే మరో ముఖ్యమైన ప్రాజెక్ట్‌కు కూడా ఓకే చెప్పానని ఆమె తెలిపారు. వచ్చే వారం నుంచి ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చెప్పారు.

Renu Desai Re Entry in Tollywood