Home సినిమా అందుకే విడాకులు తీసుకున్నా

అందుకే విడాకులు తీసుకున్నా

renu

రేణుదేశాయ్ నోరు విప్పిం ది. ఇన్నాళ్లూ పవన్‌తో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను ఎప్పుడూ బయటపెట్టని రేణు తొలిసారిగా ఈ విషయంపై మాట్లాడింది. “11 ఏళ్లు కాపురం చేసిన భర్త… భార్యకు తెలియకుండా వేరొకరితో సంబంధం పెట్టుకొని ఆమెతో ఓ బిడ్డను కంటే… భార్య పరిస్థితి ఏమిటి? అదే తన పరిస్థితి” అని కుండబద్దలు కొట్టింది. ఆ స్థితిలో ఏ భార్య అయినా ఏం చేస్తుంది, ఒకవేళ మీరూ అదే స్థితిలో ఉంటే మీకు నా బాధ తెలుస్తుందని పేర్కొంది. పవన్‌కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకుల తర్వాత ఎవరూ పవన్‌ని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేదు. కనీసం రేణుకి మద్ధతుగా కూడా ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే విడాకులకు గల కారణం బయటకు రాలేదు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. బిడ్డలిద్దరూ రేణు దగ్గరే పెరుగుతున్నారు. అప్పుడప్పుడు పవన్ దగ్గరకు వచ్చి వెళ్తుంటారు. దీంతో ప్రజలకు ఇదో కుటుంబ సమస్యగా కాకుండా కుటుంబంలో జరిగిన సంఘటనగా మాత్రమే గుర్తుంది. అయితే ఆ విడాకుల తర్వాత వెంటనే పవన్ మరో వివాహం చేసుకోవడం, అప్పటికే వారిద్దరికీ ఓ బిడ్డ ఉండటం మాత్రం కాస్త సంచలనం కలిగించింది. కానీ రేణుదేశాయ్ అప్పుడు కూడా నోరెత్తలేదు. అయితే ఇటీవల రేణు తనకు కూడా తోడు కావాలని కోరుకుంది. బిడ్డల అంగీకారంతోనే ఆమె వివాహానికి సిద్ధమైంది. తాజాగా నిశ్చితార్థం కూడా జరిగింది. దీంతో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో రేణు నిర్ణయాన్ని తప్పుబడుతూ పోస్టింగులు పెట్టడం మొదలుపెట్టారు. ఇటీవల ఈ టార్చర్ బాగా పెరిగే సరికి ఆమె విడాకులకు కారణం పవన్‌కళ్యాణ్ అని ప్రకటించి సంచలనం సృష్టించింది. వివాహ బంధంలో ఉండి కూడా భార్యకి తెలియకుండా భర్త మరో మహిళతో బిడ్డను కంటే, ఆ భార్య ఏం చేయాలి? మొగుడిని వెనకేసుకొని రావాలా? అని రేణు ప్రశ్నించింది. ఆయన చేసిన పని నచ్చకనే విడాకులు తీసుకొని దూరమయ్యానని పేర్కొంది. ఇప్పుడు తనకు, తన బిడ్డలకు తోడు కావాలి కాబట్టి మరో వివాహానికి సిద్ధమయ్యానని రేణుదేశాయ్ పేర్కొంది.