Home సినిమా నిజం ఏమిటో తెలిస్తే.. మీ నోళ్లు మూసుకుపోతాయి!

నిజం ఏమిటో తెలిస్తే.. మీ నోళ్లు మూసుకుపోతాయి!

Renu Desai Serious Warning to Pawankalyan Fans

పుణే: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకుబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను రేణు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతే… అప్పటి నుంచి రేణుకు పవన్ అభిమానుల నుంచి సామాజిక మాధ్యమాల్లో వేధింపులు పెరిగిపోయాయి. దీంతో తాజాగా ఆమె ట్విట్టర్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఇనస్టాగ్రామ్ లో మాత్రం కొనసాగుతోంది. అయితే అక్కడ కూడా ఆమెకు ఇలాంటి ఆన్ లైన్ వేధింపులు తప్పలేదు. దాంతో ఆమె పవన్ అభిమానులకు గట్టిగా క్లాస్ పీకింది.

“ఎక్కువగా రెచ్చిపోతే నిజాలు మాట్లాడాల్సి వస్తుందని, అప్పుడు అభిమానులందరూ మూసుకుంటారని హెచ్చరించింది. నా కోపం నా అపరిపక్వత కాదు. పవన్ తో విడాకుల వ్యవహారంపై చాలా ఏళ్లు నేను మౌనంగా ఉన్నందుకు మీరందరూ నాకు ధన్యవాదాలు చెప్పాలి. నిజంగా నేను నోరు విప్పి విడాకులపై నిజాలు మాట్లాడితే అభిమానులందరూ నోళ్లు మూసుకుంటారు” అంటూ రేణుదేశాయ్ పవన్ అభిమానులపై మండిపడింది. నువ్వు తప్పుచేస్తున్నావంటూ ఓ అభిమాని రాసిన సుదీర్ఘమైన కామెంట్ కు పై విధంగా ఘాటుగా సమాధానమిచ్చిందామె. చివరగా “నేను దేవుడ్ని గట్టిగా ప్రార్థిస్తున్నాను. ఒక రోజు వస్తుంది. ఆ రోజు నేను నా సోషల్ మీడియా ఖాతాలో ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటాను. నా సోషల్ మీడియా పేజీలో కేవలం నా గురించి, నా పని గురించి మాత్రమే మంచి కామెంట్స్ చదువుకునే రోజు కోసం ప్రార్థిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.