Home రాష్ట్ర వార్తలు వర్శిటీలలో ఖాళీల భర్తీ

వర్శిటీలలో ఖాళీల భర్తీ

kadiyam-srihariత్వరలో నియామకాలు, కాలేజీలు, హాస్టల్స్‌లో బయోమెట్రిక్, సిసి కెమెరాలు, ఆస్తుల రక్షణకు చర్యలు : కడియం
మన తెలంగాణ / హైదరాబాద్: యూనివర్శిటీలలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను త్వరలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే యూనివర్సిటీ, దాని అనుబంధ కాలేజీలు, హాస్టల్స్‌లో డిసెంబర్ నాటికి బయోమెట్రిక్, సిసి కెమెరాలు ఏర్పాటు చేయ నుంది. ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి శనివారం మసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాల యంలో యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్‌లు, రిజిస్ట్రార్‌లతో శని వారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యలు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఆదేశాలను కడియం శ్రీహరి అనంతరం మీడియాకు వెల్లడించా రు. రెండు దశబ్దాలుగా యూనివర్శిటీల్లో రెగ్యులర్ పోస్టుల నియామకాలు లేకపోవడంతో న్యాక్ గుర్తింపు పొందే పరిస్థితి లేకు ండా పొతుందని కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు.

గత పాలకుల నిర్ణయాల కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. కొందరు యూ నివర్సిటీలను సందర్శించిన మొసలి కన్నీరు కారుస్తున్నారని… ఇన్నాళ్లు అధి కారంలో ఏవరు ఉన్నారో తెలియదా? అంటూ కడియం ప్రశ్నించారు. యూ నివర్సిటీల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని… వాటికి సరియైన దస్తావేజులు లేవని వెంటనే యూనివర్సిటీల భూముల వివరాలను అంది ంచాల్సి ఆదేశించినట్లుగా శ్రీహరి తెలిపారు. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవడానికి సంబంధిత జిల్లా కలెక్టర్లతో కలిసి సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచించారు. ప్రహారి గోడలను నిర్మించాలన్నారు. 2016-17 నుండి డిగ్రీలో సిబిసిఎస్ విధానం, సెమిస్టర్ విధానాన్ని కూడా అమలు చేయడానికి ఇప్పటి నుండే కార్యచరణ రూపొందించు కోవాల న్నారు. యూనివర్సిటీల సేవలను దశల వారిగా ఆన్‌లైన్ లో చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఫీజు చెల్లింపులు, స్కాలర్‌షిప్‌లు, సర్టిఫి కెట్లు,తదితరాలును ఆన్‌లైన్‌లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. యూనివర్సిటీలన్నింటిలో ఈ -లైబ్రరీలు ఏర్పాటు చేయాల ని… వాటిల్లో ఇంటర్ నెట్, వై ఫైలు అందుబాటులో ఉంచాలన్నారు.

ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో మార్చిన సిలబస్‌ను యూనివర్సిటీలన్ని 2016-17 విద్యాసంవత్సరం నుండి అమలు చేయాలని సూచించినట్లుగా తెలిపారు. ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను ప్రభు త్వానికి పంపించాల్సిందిగా సూచించారు. యూనివర్సిటీలకు కావాల్సిన భవనాలు, ల్యాబ్ లు, మౌలిక సదుపాయాలు ఎంత అవసరం ఉన్నాయో ప్రతిపాదనలు పంపిస్తే దశల వారిగా వాటికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతితో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఉస్మానియాలో అదనపు వసతి ఏర్పాటుకు రూ.22.50కోట్లను ఇటీవలే విడుదల చేశామన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒక సారి విసిలతో సమీక్షా సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి విసిలు వాణి ప్రసాద్, పార్ధసారధి, జనార్ధన్‌రెడ్డి, టి.చిరంజీవులు, శైలజా రామయ్యార్, వీరారెడ్డి, సత్యనారా యణ, భాగ్యనారాయణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌లు ప్రొఫెసర్ వెంకటాచలం, ఫ్రొపెసర్ టి.మల్లేశ్‌లు పాల్గొన్నారు.