Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

డిఎస్‌సిపై వారంలోపు కమిటీ నివేదిక

ganta-Srinivasగుంటూరు: డిఎస్‌సిపై వారంలోపు కమిటీ నివేదిక వస్తుందని ఎపి విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కమిటీ నివే దిక వచ్చాక తదుపరి కార్యాచరణ ఉంటుం దని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో పరిశుభ్రత వారోత్సవాలు నిర్వహించా లని ఆదేశించారు. ప్రైవేటు విశ్వవిద్యాల యాల బిల్లు అంశంపై ఈ నెల 27న విద్యా శాఖ అధికారులతో కలిసి సింగపూర్‌లో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈనెల 16న కేంబ్రిడ్జి వర్శిటీ ప్రతినిధులతో ఢిల్లీలో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. నాగార్జున యూనివర్శిటీలో పలు మార్పులు చేశామని మంత్రి గంటా చెప్పారు. ఇన్‌చార్జి విసిగా ఉదయలక్ష్మీని నియమించిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలపై శనివారం మంత్రి గంటా సమీక్షించారు.

రిషితేశ్వరి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎవరూ చుట్టాలు కాద న్నారు. రిషితేశ్వరి ఘటనతో అన్ని వర్శిటీల ప్రక్షాళన జరుగుతుందన్నారు. 360 డిగ్రీల ఫీడ్‌బ్యాక్ ద్వారా సూచనలు అందాయని తెలి పారు. విశాఖలో ప్రారంభించిన అభయ ఐక్లిక్ యాప్‌ను త్వరలో అన్ని వర్శిటీల్లో ప్రవేశపెట్ట నున్నట్లు గంటా చెప్పారు. ప్రతి యూనివర్సిటీలో ఐదుగురు పోలీసులతో మొబైల్ వ్యాన్‌ను ఏర్పాటు చేస్తామని, ఏ చిన్న ఘటన జరిగినా సిఎస్, డిజిపి సహా ప్రభుత్వం అప్రమత్తమయ్యేలా టెక్నాలజీ తీసుకువస్తామని మంత్రి గంటా పేర్కొన్నారు.

Comments

comments