Search
Wednesday 26 September 2018
  • :
  • :

తెరపైకి కొత్త రూ. 200 నోటు?

RBIన్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అనంతరం కేంద్రం కొత్తగా రూ. 2000, రూ. 500 నోట్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే రూ. 2000 నోట్లకు చిల్లర దొరకక సామాన్య జనం ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆర్‌బిఐ తీపి కబురు అందించింది. చిల్లర కొరతను అదిగమించేందుకు త్వరలోనే రూ.200 నోట్లను తీసుకురానుందట.

మార్చిలో జరిగిన డైరెక్టర్ల బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆర్‌బిఐ కేంద్రానికి ప్రతిపాదనలను కూడా పంపించింది. కేంద్ర అనుమతిరాగానే కొత్త రూ. 200 నోట్లను ముద్రించేందుకు సిద్ధంగా ఉంది. నకిలీ కరెన్సీ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు అదనపు భద్రతా లక్షణాలతో నూతన రూ .200 నోట్లు తీసుకురానుందని సమాచారం.

వీటి ముద్రణకు అధికారుల ఆమోదం కోసం వేచి చూస్తోందని విశ్వనీయ వర్గాలు తెలిపాయి. కేంద్రం దీనికి అనుమతిస్తే జూన్ తరువాత నుంచి వీటి ముద్రణ ప్రారంభం కానుందని తెలుస్తోంది. డిమానిటైజేషన్ తరువాత నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా విషయం తెలిసిందే. కాని అవి అనుకున్నంత మేరకు లేకపోవడం, చిన్న నోట్ల కొరత ఉండడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Comments

comments