Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

వడగళ్ల నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం: కలెక్టర్

stand3

మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ల వల్ల జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌వెల్లడించారు. ఆ దివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం బందనకల్, మొర్రాయిపల్లె, గూడెం గ్రామాల్లో యాదగిరిగౌడ్, విట్టల్, గూడెపు దేవేందర్‌లకు చెం దిన మామిడి క్షేత్రాల్లో ఈదురుగాలులకు రాలిన మామిడికాయలను ,వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న వరి,ఇతర పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భ ంగా జిల్లాలో వర్షభీభత్సానికి ఈదురుగాలులకు నష్టపోయిన పంటల వివరాలను సేకరిస్తున్నామని,ప్రభుత్వానికి నివేదికను పంపి బాధిత రైతులందరికి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజే ంద్రకృష్ణ మాట్లాడుతూ ప్రాథమిక అంచనా ప్రకారం 300 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ గడ్డం న ర్సయ్య,ఎంపిపి అక్కరాజు శ్రీనివాస్, క్ల స్టర్ అధికారి నిరోష,ఆర్‌డిఒ పాండురంగ, తహసీల్దార్ రాజు,ఇతర అధికారు లు పాల్గొన్నారు

Comments

comments