Home సూర్యాపేట పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్లపై చర్పోపచర్చలు

పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్లపై చర్పోపచర్చలు

Reports on Panchayat Election Reservations

గ్రామ పంచాయతీ పోరుకు సన్నద్ధం అవుతున్న అధికార, విపక్ష పార్టీలు
రిజర్వేషన్ కోసం కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్న ఆశావహులు

మనతెలంగాణ/తుంగతుర్తి:  పంచాయితీ ఎన్నికలకు సైరన్ మోగనుందని  వస్తున్న  వార్తలతో పల్లె రాజకీ యాలు వేడెక్కు తున్నాయి. ఏగ్రామంలో  చూసినా రిజ ర్వేషన్ల విషయంపై తర్జన భర్జనలవుతున్నారు. గతంలో ఉన్న రిజర్వేషన్‌లను దృష్టిలో ఉంచుకుని ఈసారి రిజ ర్వేషన్ విధానంపై చర్చోప చర్చలు జరుగుతు న్నాయి.  ఆశావహులు తమతమ పార్టీల నేతలను ,ద్వితీయ శ్రేణి  నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజిగా కనిపి స్తున్నారు. అధికార, విపక్ష పార్టీలు విపక్షాలు గ్రామా లలో సర్పంచ్లుగా గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధులను గుర్తిం  చడంలో కొంత సమాచార సేకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. తుంగతుర్తి నియోజక వర్గంలో తొమ్మిది మండలాలు ఉండగా, గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో   టిఆర్‌ఎస్ ,కాంగ్రెస్ ,వైసిపి పోటీ చేసాయి. పోటీ ప్రధానంగా నాడు కాంగ్రెస్ , వైసిపి మధ్యనే జరిగింది. గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ మెజార్టీ సాధించగా ద్వితీయ స్థానంలో వైసిపి నిలిచింది. మారిన రాజకీయ పరిణామాలలో విపక్ష పార్టీల నుండి గెలిచిన సర్పంచ్‌లు టిఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో ప్రస్తుతం సర్పంచ్‌ల్లో అధిక శాతం టిఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. విపక్ష పార్టీలలో ఒకరిద్దరు మినహా ఎవరూ మిగలలేదు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా గాదరి కిశోర్ కుమార్ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపడంతో తమ పార్టీల నుండి టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నాటి వైసిపి నేత ,మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావు ప్రస్తుతం బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఈసారి తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బిజెపి సర్పంచ్ అభ్యర్ధులను నిలపనున్నట్లు సమాచారం .పోటీ టిఆర్‌ఎస్ ,బిజెపి ,కాంగ్రెస్‌ల మధ్య తీవ్రంగా ఉంటుందనే మాట వినవస్తోంది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావులు తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో  ఎంఎల్‌ఏలుగా గెలిచారు.  తమ తమ పార్టీల పక్క నియోజకవర్గంలోకి వెళ్ళినా ఇంకా తుంగతుర్తిపై పట్టుకోసం కృషి చేస్తునే ఉన్నారు. వారిరువురి పరిస్థితి ఇలా ఉంటే శాసన సభ్యులు గాదరి కిశోర్ కుమార్ సర్పంచ్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌దే పై చేయి కావాలనే ధ్యేయంతో గ్రామాలలో పర్యటనలు,అభివృద్ధి పనులు శంకుస్థాపనలకు వేగం పెంచారు. రోజుకు రెండు మూడు మండలాల చొప్పున పర్యటిస్తూ అనేక గ్రామాల్లో సిసి రోడ్లు  , స్మశాన వాటికలతో పాటు వివిధ రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన  మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వంలో మండల కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యాలయాలు ప్రారంభిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగుతున్నారు. మాజీ  ఎమ్మెల్యే సంకినేనికి సైతం నియోజక వర్గంలో మంచి పట్టుంది. బిజేపి ఇంకా నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించనే లేదు. ఎన్నికల షెడ్యూల్ వెలుపడిన క్షణం టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజేపి అధినాయకత్వాలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించడానికి సన్నాహాలు జోరుగా చేస్తున్నారు. ముఖ్యంగా సర్పంచ్‌ల రిజర్వేషన్ కోసం అటు నాయకులు ,ఇటు ఆశావహులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్ ఒకటి రెండు రోజుల్లో వస్తుందనే మాట ఆశావహుల్లో కంటి మీద కునుకు లే కుండా చేస్తోంది. ఏది ఏమైనా  ఈసారి స్థానిక ఎన్నికల సంగ్రామం  నియో జకవర్గంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు మెజార్టీ సాధిస్తారో వేచి చూద్దాం.