Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

నేడు రీ పోస్టుమార్టం

Murder-of-Madhukar

మంథని: మంథని మధుకర్ అనుమానాస్పద మృతి కేసులో మృతదేహనికి హైకోర్టు ఆదేశాలనుసారం ఉస్మానియా, కాకతీయ ఫోరెనిక్స్ నిపుణుల ఆధ్వర్యంలో జిల్లా చీఫ్ మేజిస్ట్రేట్, కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం ఉదయం రీ పోస్టుమార్టం నిర్వ హించనున్నారు. గడిచిన శుక్రవారమే మధు కర్ మృతదేహనికి రీ పోస్టుమార్టం నిర్వహిం చాల్సి ఉండగా, తమకు కాకతీయ వైద్య బృందం, స్థానిక పోలీసులపై నమ్మకం లేదని, హై కోర్టు జడ్జి సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వ హించాలని మధుకర్ తల్లి లక్ష్మిహైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. దానిపై హైకోర్టు ఆమెకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయడంతో రీ పోస్టుమార్టం సోమవారానికి వాయిదా పడిం ది. మధుకర్‌ది ఆత్మహత్య కాదని, హత్యే అని గత వారం రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు తీవ్రతరం కావడం, పోలీసులు, పాలకుల అండతో నిందితులతో కుమ్మకై కేసును నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నా రన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో రీ పోస్టుమార్టం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Comments

comments