Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ కార్యాలయంలో గణతంత్రదినోత్సవ వేడుకలు

టిఆర్‌ఎస్ కార్యాలయంలో గణతంత్రదినోత్సవ వేడుకలు

జాతీయపతాకాన్ని ఎగరవేసిన కెటిఆర్
భారీగా తరలివచ్చిన పార్టీనాయకులు,ప్రజాప్రతినిధులు
కార్యకర్తలకు గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్
తెలంగాణ తల్లికి, ప్రోఫెసర్ జయశకర్‌కు నివాళి

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో 70 ఏళ్ల గణతంత్రదినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జెండావందనానికి ముందు కెటిఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి,తెలంగాణ సిద్దాంత కర్త ప్రోఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం నుంచి వందలాధిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కెటిఆర్ కంటే ముందుగా రాష్ట్ర హోంశాఖమంత్రి మహ్మద్ మహ్మమూద్ ఆలీ, తాజామాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే శాసనమండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, శంబీపూర్ రాజు, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కెటిఆర్ అందుబాటులో ఉన్నముఖ్యనాయకులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. బారులుతీరిన టిఆర్‌ఎస్ కార్యకర్తలను కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఇచ్చిన వినతిపత్రాలను స్వీకరించారు. కాప్రాకు చెందిన రెండేళ్ల చిన్నారి మిథిల్ కాలేయవ్యాధితో బాదపడుతున్నాడని మిథిల్ బందువులు కెటిఆర్‌కు వినతి పత్రం సమర్పించగా సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉండగా టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండర్‌ను కెటి.రామారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖమంత్రి మహమూద్ అలీ ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసన సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ట్విట్టర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ విదేశాల్లోని తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర శుభాకాంక్షలను కెటిఆర్ తెలిపారు.
డోర్నకల్ నియోజకవర్గంలో పర్యటించనున్న కెటిఆర్
నేడు టిఆర్‌ఎస్‌వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డోర్నకల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు ఉదయం 9. గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా బయలు దేరి మధ్యాహ్నం 12. గంటలకు మరిపెడ మండలం చేరుకుంటారు. మరిపెడ మండలంలోని పురిశోథ గూడెంలో టిఆర్‌ఎస్ పార్టీ నూకల నరేష్ రెడ్డి తల్లి పెద్దకర్మకు హాజరవుతారు. ఆతర్వాత డోర్నకల్ లో అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఆతర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

Republic day Celebrations at TRS Office