Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Rajaiah

జనగామ టౌన్: 68వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని గురువారం జనగామ మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమీషనర్ బలరాం మువ్వెన్నెల జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ బ్రిటిష్ కబంద హస్తాల నుండి స్వాతంత్య్రం సంపాదించుకున్న తరువాత మన దేశ సార్వభౌమత్వానికి అనుగుణంగా ఒక రాజ్యాంగం అవసరం అని బావించిన ఆనాటి దేశ నాయకులు డా॥ బిఆర్ అంబేద్కర్ గారి అధ్వర్యంలో రెండు సంవత్సరాల, 11 నెలల 11 రోజుల పాటు రాజ్యాంగాన్ని రచించారని, జనవరి 26 1956 నుండి నిజమైన స్వాతంత్య్రం రాజ్యాంగ రచనతో సిద్దించినట్లయిందని ఆయన అన్నారు. ప్రతి పౌరుడు దేశ భక్తితో పాటు రాజ్యాంగం పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గాడిపెల్లి ప్రేమలతా రెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు కార్యాలయ సిబ్బంధి, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవ ర్యాలీ

జనగామ ప్రతినిధి: స్థానిక పట్టణంలోని సంజయ్ నగర్ నందుగల అగాసీ పాఠశాల విద్యార్థులు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలోని పలు వీదుల్లో ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం పాఠశాలలో జెండా అవిష్కరణలో కరెస్పాండెంట్ కె జయమణి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు లు టి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
గుండాలలో…

గుండాల:86వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని వివిద గ్రామాలలతో పాటు గుండాల మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయంలో డివ్యూటి తహశీల్దార్ మన్నన్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ జె రవిందర్, విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్, చేనేత సహకార సంఘంలో చైర్మన్ ఉప్పలయ్య, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ పురెందర్ భట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కిరణ్, ప్రాథమిక వ్యవసాయ పరపత్ సంఘం చైర్మన్ దుంపల శ్రీనివాస్‌లు, కస్తూరిబా గురుకుల పాఠశాల ఎస్‌ఓ విజయ లక్ష్మి, అధర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ సురేష్ కుమార్, గుండాల గ్రామ పంచాయితీలో సర్పంచ్ సునిత, బిసి బాలుర వసతి గృహంలో విజయ్ కుమార్, స్త్రీశక్తి భవనంలో పకీరయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అగ్గిరాముడు, ఎఈఓ అలీమోద్దిన్, డాక్టర్ యాఖూబ్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కలీల్, ఎంఎ రహీమ్, అండం సంజీవ రెడ్డి, జడ్పిటిసి మందడి రామక్రిష్ణ రెడ్డి, ఎంపిపి సంఘీ వేణుగోపాల్ , వైస్ ఎంపిపి కాలె మల్లెష్, మాజి జడ్పిటిసి గడ్డమీది పాండరి, చిన్నం ప్రకాష్, ఆకునూరి యాదగిరి, మదుల బాల్‌రెడ్డి,బబ్బూరి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

బిజేపి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనగామరూరల్: 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జనగామ బిజేపి పార్టీ కార్యాలయంలో ఘణంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కేవిఎల్‌ఎన్‌రెడి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్‌అంబేద్కర్ సేవలు చిరస్మర నీయమైనవన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేటి భారతదేశ అభివృద్దికి సూచికఅని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాదనే బిజేపి లక్షమ న్నారు. నరెంద్రమోడి పెద్ద నోట్లను రద్దుచేయడం వల్ల ఆర్థిక అసమానతలు తొలిగి పోవడానికి ఒక మార్గం లాంటిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శులు దొంగరి మహెందర్, మోత్కుపల్లి ఆగయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, యువమోర్చ అధ్యక్షులు కే. స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు శివరాజు యాదవ్, మున్సిపల్ వైస్‌చైర్మెన్ నాగారపు వెంకట్, వేములవాడ సీతారాములు, నాయకులు జగదీష్, నారాయణ, అనిల్, బాస్కర్, బొక్క ప్రభాకర్, టి. లక్ష్మి, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనగామరూరల్: 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండలకేంద్రంలోని ఎంపీడీఒ కార్యాలయంలో ఎంపీడీఒ హసీం, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ బి. చెన్నయ్య జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో వీరు నాయక్, స్థానిక మార్కేట్ యార్డులో మార్కేట్ చైర్‌పర్సన్ బండ పద్మ యాదగిరిరెడ్డి, ఇరిగేషన్ కార్యాలయంలో డీఈ రవిందర్‌రెడ్డి పతావిష్కరణ చేశారు. అదేవిధంగా మండలంలోని అడవికేశ్వాపూర్‌లో సర్పంచ్‌లు రాజేంద్రప్రసాద్, చిటకోడూర్‌లో సర్పంచ్ ఎల్లమ్మ, చౌడారం కోంరయ్య, మరిగడి ఎడ్ల సరిత, పసరమడ్ల మంజూల, ఓబుల్‌కేశ్వాపూర్ జయప్రకాశ్‌రెడ్డి, పెద్దరాంచర్ల వల్లాల మల్లేశం, పెంబర్తి బాల్నే సిద్దిలింగం, శామీర్‌పేట బనుక రమాదేవి, ఎల్లంల బండ వెంకటేష్, ఎర్రగొల్లపహడ్ బైరగొని చంద్రం, గోపిరాజుపల్లి గొండేటి యాదమ్మ గ్రామపంచాయితి కార్యాలయాలలో జెండాను ఎగరవేశారు. అలాగే బ్రిలియంట్ యూత్ ఆధ్వర్యంలో 68 వ గణతంత్ర దినోత్సవం శామీర్‌పేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. బ్రిలియంట్ యూత్ అధ్యక్షులు టి. రంజిత్‌కుమార్ జెండాఆవిష్కరణ చేయగా ముఖ్యఅతిధులుగా గ్రామ సర్పంచ్ బనుక రమాదేవి, ఎంపీటీసీ గణీపాక మహెందర్ పాల్గొన్నారు.

జఫర్‌గడ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

జఫర్‌గడ్ : మండల కేంద్రముతో పాటు వివిధ గ్రామలలో 68వ గణాతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకోని ప్రవేట్, ప్రభుత్వ కార్యాలయలతో పాటు ప్రజలు వాడ వాడల జాతీయ జేండాలను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకోని మండల కేంద్రములోని తహసీల్థార్ కార్యాలయంలో తహసీల్థార్ మనోహరచారీ, ఎంపిడివో కార్యాలయంలో ఎంపిడిఓ గొడిశాల రవిందర్ గౌడ్, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ బండారి సంపత్, వ్యవసాయ కార్యాలయంలో ఎఇ మురళి, , మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ శ్రీకాంత్, సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహములో వార్డెన్ విద్యారాణి, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో వైద్యాదికారి డాక్టర్ రవికిరణ్, ప్రభుత్వ పశువైద్యశాలలో వేటర్నరి డాక్టర్ గోపాల కృష్ణమూర్తి, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తిరుపతి రెడ్డి, గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ దెవరాయి స్వరూప, టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అద్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, టిడిపి పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అద్యక్షుడు రాపర్తి యాకయ్య, కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అద్యక్షుడు చిట్టిమేళ్ల కృష్ణమూర్తి, అవంతి డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గడ్డం రాజులతో పాటు వివిద గ్రామలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయలు, పాఠశాలలు, గ్రామపంచాయితీ కార్యాలయలలో ఆయా అదికారులు, ప్రదానోపాధ్యాయులు, సర్పంచ్‌లు జాతీయ జేండాలను ఎగరవేసి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిద పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

ఉత్తమ విద్యార్థులకు నగదు పరస్కారం

దేవరుప్పుల: మండలంలోని పెద్దమడూర్ ఉన్నత పాఠశాలలో అత్యత్తమ ఫలితాలు సాదించిన విద్యార్థులకు అకవరం సోమనర్సింహరెడ్డి ట్రస్ట్ ఆద్వర్యంలో నగదు పురస్కారాలను అందించారు. గురువారం జరిగిన గణతంత్య్ర వేడుకలలో భాగంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బిజెపి జిల్లా అద్యక్షుడు కెవిఎల్‌ఎన్ రెడ్డి ముఖ్య అతిదిగా పాల్గొని విద్యార్థులను ప్రశంశిచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యణభ్యసించి తల్లిదండ్రులను, దేశ భవిష్యత్తుకు తోడ్సడాలని విద్యార్థులకు సూచించారు. 2015-15 విద్యా సంత్సరంలో అత్యుత్తమ ఫలితాలు సాదించిన విద్యార్థులు జోగు హరితకు రూ 5116, బెజగం ఉషకు రూ.3116, భానోతు కళ్యాణికి రూ.1116 నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయుడు సుగుణాకర్‌రెడ్డి, బిజెపి జనగామ జిల్లా కార్యదర్శి దుబ్బ రాజశేఖర్, గ్రామ సర్పంచి బొనగిరి నర్సింహ్మా, ఎస్‌ఎంసి చైర్మన్ యాదలోక్ష్మీ, ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.

మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

తరిగొప్పుల: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో జెండాను ఎగురవేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. గురవారం 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎమ్మార్వో కార్యాలయంలో తహశీల్దార్ వవిత్ర వాణి, స్థానిక రక్షక భట నిలయంలో ఎస్‌ఐ రాజేష్ నాయక్, ఆటో యూనియన్ నాయకులు యువజన సంఘాల నాయకుల ఆద్వర్యంలో మిఠాయిలు పంచి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్‌ఐ వంశీక్రిష్ణ, విఆర్‌ఓ జయాలు, అంజయ్య, గంగ రాజు, విఆర్‌ఓ లు, ఆటోయూనియన్ యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు.

Comments

comments