Home అంతర్జాతీయ వార్తలు వర్జీనియాలో రిపబ్లికన్ పార్టీ ఎంపిపై కాల్పులు

వర్జీనియాలో రిపబ్లికన్ పార్టీ ఎంపిపై కాల్పులు

Steve-Scalise

వర్జీనియా: అగ్రరాజ్యం అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపి స్టీవ్ స్కేలిస్‌పై కాల్పులు జరిగాయి. వర్జీనియాలోని బేస్‌బాల్ స్టేడియం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బేస్‌బాల్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ కాల్పుల సంఘటన జరిగినట్లు స్థానికులు చెప్పారు. స్టీవ్‌తో పాటు మరికొంత మందిపై పలుమార్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరిపిన అనుమానితున్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అనంతరం కాల్పుల్లో గాయపడిన స్టీవ్ ను ప్రత్యేక హెలికాప్టర్ లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.