Home నవ విజ్ఞానం బాస్కింగ్ షార్కు వలసలపై పరిశోధన

బాస్కింగ్ షార్కు వలసలపై పరిశోధన

Research on immigration to the basking shark

బాస్కింగ్ షార్కు చేపల వలస విధానాన్ని పట్టుకోవడానికి శాస్త్రవేత్తలు శాటిలైట్ ట్రాక్టర్లను, సైటింగ్‌లను ఉపయోగిస్తున్నారు. పశ్చిమ ఫ్రాన్సు సముద్రజలాల్లో బాస్కింగ్ షార్క్ ఆగకుండా సాగిపోతుండడం నావికులకు చాలా అరుదైన దృశ్యం కాగా, ప్రపంచమంతా సాగుతున్న ఈ షార్కు రహస్య వలస విధానాలను తెలుసుకోవడానికి ప్రయత్నించే శాస్త్రవేత్తలకు ఇదోక వరం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద భారీ చేపగా పేర్కొనే ఈ బాస్కింగ్ షార్కు 10 మీటర్లకు మించి పొడవు కలిగి ఉంటుంది.దీన్ని పరిరక్షించాలని కాంక్షిస్తున్నారు. ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతున్న వేటలో ఇది అంతరించిపోకుండా చూడాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీని భారీ రెక్క పొలుసుకు చైనాలో ఎంతో క్రేజ్ ఉంది. దాంతో సూప్ తయారు చేస్తుంటారు. చమురు కలిగిన కాలేయం, మాంసం, విపరీతంగా ఆహారానికి వినియోగిస్తుండడంతో ప్రపంచం మొత్తం మీద వీటి సంతతి క్షీణిస్తోంది.

వీటిలో ఉత్పత్తి సామర్థం తక్కువకావడంతో ఇవి తిరిగి పునరుత్పత్తికి ఎంతో కష్టపడవలసి వస్తోంది. అయితే ఇవి ఎక్కడ ఎప్పుడు ప్రత్యుత్పత్తి చేస్తాయో ఎవరికీ తెలీదని శాస్త్రవేత్త ఎపిఇసిఎస్ రీసెర్చి గ్రూపునకు చెందిన పరిశోధకుడు అలెగ్జాండ్రా రోహర్ చెప్పారు. ఎక్కువగా ఈ జాతి షార్కు చేపలు వేసవికాలంలో కనపడుతుంటాయి. చలికాలంలో అదృశ్యమవుతాయి. ఉష్ణ ప్రాంతాలకు వలస వెళ్తుంటాయని, లేదా సముద్రం అడుగున ఉండవచ్చని సిద్ధాంతీకరిస్తున్నారు. కొత్త ట్రాకింగ్ టెక్నాలజీ ఉపయోగించి పరిశోధకులు షార్కులు నీటి మీదకు ఎప్పుడు వస్తాయో అప్పుడు వాటిని పరిశీలిస్తుంటారు. వాటి వలస విధానాన్ని తెలుసుకొంటున్నారు. 2016 సెప్టెంబర్ 20న ఉత్తరస్కాట్‌లాండ్ సముద్రతీరంలో ఆడ షార్కును పట్టుకుని టాగ్ అనుసంధానించారు. నాలుగునెలల తరువాత ఇది కెనరీ ద్వీపాల దక్షిణ దిశలో నీటిపై తేలుతూ కనిపించింది. 2017 మేలో ఇదే షార్కు బ్రిటనీ దక్షిణంగా ఉన్న బే ఆఫ్ బిస్కేలో కనిపించింది. ఈతగాళ్లు, నావికుల నుంచి, ఇతర వర్గాల ప్రజల నుంచి పరిశోధకులు సమాచారం సేకరిస్తున్నారు.
– సైన్స్ విభాగం, మన తెలంగాణ