Home ఎడిటోరియల్ పరిశోధన పరిరక్షణ ఉద్యమమే ’యూజీసీ ముట్టడి’

పరిశోధన పరిరక్షణ ఉద్యమమే ’యూజీసీ ముట్టడి’

UGC-2ఇటీవల ’రేయింబవళ్లు.. యూజీసీ ముట్టడి’ ప్రముఖ నినాదంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఈ నినాదమే ప్రతిధ్వనిస్తోంది. మానవవనరుల శాఖ సూచనల మేరకు ఎన్‌ఈటీ రహిత స్కాలర్‌షిప్పులను ఆపేయాలన్న యూజీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిం చారు. ఈ నేపథ్యంలోనే ఈ నినాదం ఆవిర్భ వించింది. విద్యార్థి సంఘాల తక్షణ ఆర్థిక డిమాండు ఈ ఉద్యమానికి నాంది పలికినప్పటికీ దీని పరిధి, స్థాయి ప్రస్తుతం మించిపోయింది. ఇప్పుడు ఇది ఒక నిర్ణయానికి వ్యతిరేకపోరాటం మాత్రమే కాదు. భారతీయ విశ్వవిద్యాలయాలు, రీసెర్చి ఇన్‌స్టి ట్యూట్స్ పరిశోధనలను ఆర్థికపెట్టుబడిదారీ వ్యవస్థ పట్టునుండి కాపాడటమే దీని ప్రధాన ఎజెండాగా మారింది. ’రీసెర్చ్’, ’రీసెర్చ్ స్కాలర్’ ఉద్దేశమే నేడు ఇబ్బందుల్లో పడింది.
ఏ దేశమైనా సరే పురోగతి, సామాజిక వర్గాల సమానా భివృద్ధి సాధించాలంటే ముందుగా సమస్య లు, వాటి పరిష్కారాలను ఆ దేశం తెలుసుకోవాలి. ఇది సామాజిక సమస్య లకు మాత్రమే కాదు విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం సమస్యలకు కూడా ఇది వర్తిస్తుంది. దీనిలో మానవులు, విజ్ఞానంపై కనీసస్థాయి అధ్యయనం కీలకం. దీని ద్వారా పేదరికం, క్షుద్బాధ, సామాజిక రుగ్మతలు, ఆరోగ్య పరిరక్షణ మొదలగు వాటిని గుర్తించగలం. మన రీసెర్చి ఇన్‌స్టిట్యూట్స్, యూనివ ర్సిటీలకు ఈ బేసిక్ రీసెర్చి తప్పనిసరి. దేశ పురోభివృద్ధిలో యూని వర్సిటీలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ’యూనివ ర్సిటీలు విజ్ఞాన నిలయాలు’ అని డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు.
యూనివర్సిటీలు పరిశీలన, విమర్శ కేంద్రాలు
దేశంలోని అనేక పరిశోధనా కేంద్రాలు, వర్సిటీల్లో వేలాది మంది రీసెర్చిస్కాలర్లు ఉన్నారు. వీరంతా ఎంఫిల్, పీహెచ్‌డీ కార్యక్రమాల్లో నిమగమైఉన్నారు. ఎంతో సహనం, ఏకాగ్రతతో కూడుకున్న పరిశోధన అనునది దీర్ఘకాల ప్రక్రియ కాబట్టి ప్రభుత్వం వీరికి ఆర్థికంగా తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది. తమ కుటుంబాల నుండి డబ్బులు అడగలేక.. తాము జీవనం సాగించేది ఎలాగో తెలియని డోలాయమాన స్థితిలో ఈ విద్యార్థులు ఉన్నారు. అయితే చాలా కుటుంబాలు ఆర్థిక చేయూతను అందించ లేని పరిస్థితిలో ఉన్నాయన్నది వాస్తవం. కాబట్టే ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందించ గలిగితేనే వీరు మనసుపెట్టి నిజాయితీగా తమ పరిశోధనలను పూర్తిచేయగలరు.
దీనికోసం యూజీసీ, సీఎస్‌ఐఆర్ అందుబాటు లోకి తెచ్చిన ఫెల్లోషిప్ సౌకర్యాన్ని యూనివర్సిటీలు కల్పించాయి. ఈ స్కాలర్‌షి ప్పులను పొందాలంటే ప్రతి ఏటా రెండుసార్లు జేఆర్‌ఎఫ్/ఎస్ ఆర్‌ఎఫ్‌లకు యూసీజీ, సీఎస్‌ఐఆర్ నిర్వహించే పరీక్షల్లో విద్యా ర్థులు ఉత్తీర్ణత సాధించాలి. అయితే ఈ పరీక్షల్లో ’ఎంపిక’ అయ్యేవారికన్నా ’రిజెక్ట్’ అయ్యే వారి సంఖ్యే అధికంగా ఉంటుందన్నది వాస్తవం. ఈ విధా నం ప్రశ్నించదగినది. విద్యార్థులకు చేయూత నందించి ప్రోత్సహించటం కాక వారిని తొలగిం చటమే దీని ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. ఈ పరీక్షలో అన్ని మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అయితే బజారులో దొరికే గైడ్ల సాయం తో ఉత్తీర్ణత పొందవచ్చునని, ఇక్కడ పరిశోధన సంబంధిత పరిజ్ఞానం, నైపుణ్యతతో పనిలేదని వివిధ అధ్యయనాల్లో వెల్లడయ్యింది. అధిక ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోగలిగిన వారికి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే మల్టీఛాయిస్‌లో ఎంత త్వరగా జవాబులను ఎంపిక చేసుకునే నైపుణ్యం మీద ఇది ఆధారపడి ఉంటుం దన్నది కూడా నిజమే. అయితే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత, మెరిట్‌లిస్ట్‌లో స్థానం సాధించలేని విద్యార్థు లకు నాన్-ఎన్‌ఈటీ ఫెలోషిప్‌లు ఊరటనిస్తాయి. ఎంఫిల్, పీహెచ్‌డీలకుగాను వీరికి నెలకు రూ.5 వేలు, రూ.8వేలు లభిస్తాయి. ఈ ఫెలోషిప్‌లను పీహెచ్‌డీ లకు అయితే నాలుగేళ్లు, ఎంఫిల్ విద్యార్థులకు 18 నెలల వరకు అందజేస్తారు. దీంతో పాటు పుస్తకాలు, జర్నల్లు కొనుక్కున్నేందుకు, ఫొటో కాపీలు తీసుకొనేందుకు వార్షిక అత్యవసర నిధి లభిస్తుంది. ఇది చాలా తక్కువైనప్పటికీ కీలకమై నది. ఎక్కువమంది రీసెర్చిస్కాలర్లకు ఈ నిధి లైఫ్‌లైన్‌లా పనిచేస్తోంది.
ఇలాంటి పరిస్థితిలో దీనిని ఎత్తివేయాలన్న యూజీసీ నిర్ణయ ప్రభావం రీసెర్చిస్కాలర్ల్లపైనే కాక భారత పరిశోధనలపై కూడా తీవ్రప్రభావం పడుతుంది. ఈ తాజా నిర్ణయం వల్ల వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఎక్కువ ఇబ్బంది కలుగు తుంది. ముఖ్యంగా మహిళా పరిశోధకులపై దీని ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది. ఆర్థిక సాయం లేకపోతే వారు కుటుంబాల ఒత్తిడి వల్ల ఇంటిబాట పట్టక తప్పదు. మొత్తంమీద వీటి ప్రభావం దేశ పరిశోధనలపై తీవ్రంగా పడనుంది. యూజీసీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం సుమారు 35వేల మందికిపైగా నాన్-ఎన్‌ఈటీ ఫెలోషిప్‌పై ఆధారపడి ఉన్నారు. అంటే దీనిని ఎత్తివేస్తే ఇంతమంది సమర్థులైన స్కాలర్లను దేశం కోల్పోతోందన్న మాట. ఇదంతా ఎన్డీఏ ఆచరిస్తున్న విస్తృత ఆర్థిక విధానం లో భాగం. పరిశోధన, విద్య సహా అన్నింటిని మార్కెట్ ఆధీనంలో వదిలేస్తున్నారు. సొంతంగా నిధులను సమకూర్చు కోవాలని పరిశోధన కేంద్రా లకు, యూనివర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం చెబు తోంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళన వల్ల యూజీసీ ఒత్తిడిని అనుభవిస్తుంటే మరోవైపు కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండిస్టియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) లాబ్‌లకు సగం నిధులు సమకూర్చుకోవాలని సైన్స్ బయో టెక్నాలజీ మంత్రిత్వశాఖ సూచించిందంటూ వార్తలొ చ్చాయి. జాయింట్ రీసెర్చ్ వెంచర్ల కోసం పరిశోధన కేంద్రాలను మార్కెట్, పరిశ్రమలతో భాగ స్వామ్యం చేయనున్నారు. ’రీసెర్చ్ ఫర్ ప్రాఫిట్’ కోసం వచ్చే రెండేళ్లకుగాను బిజినెస్ తరహాలో కాస్ట్ క్లియర్ రెవెన్యూ అభివృద్ధి నమూనాను రూపొం దించాలని మంత్రిత్వశాఖ ’డెహ్రాడూన్ డిక్లరేషన్’లో పేర్కొంది. జూన్ 6న జరిగిన ఈ సమావేశంలో మంత్రిత్వశాఖ అధికారులతో సహా సీఎస్‌ఐఆర్ శాస్త్రవేత్తలు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అయితే ’స్వదేశీయ విజ్ఞానం’ (ఇండిజీనియస్ సైన్స్) ఆలోచనకు హామీ కల్పించే విధంగా వారు చర్చల్లో క్రియా శీలంగా పాల్గొన్నారు. దీనినిబట్టి దేశీయ వర్సిటీలు, పరిశోధనలు మార్కెట్ దయాదాక్షిణ్యా లపైనే ఆధారపడి ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రైవేటు కంపెనీలు, ప్రైవేటు నిధుల ఏజెన్సీల నిధుల ఆధారంగా ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా నిధులు సమకూరితే పరిశోధన ప్రాజెక్టుల ను కూడా ఈ ఏజెన్సీలే నిర్ణయిస్తాయి. దీంతో పరిశోధన ఉద్దేశమే ప్రశ్నార్థకమౌతుంది. దేశంలో పరిశోధన పరిస్థితి ఘోరంగా ఉంది. కొత్త కల్పన, మార్పులలో భారత్ కన్నా మిగతా వర్ధమాన దేశాలు ముండదుగులో ఉన్నాయి. పురోభివృద్ధి పథంలో అడుగులు వేస్తున్న భారత్ సహా మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకూ ఫార్మాసూటికల్స్, బయో టెక్నాలజీ, నానో సైన్సెస్, హెల్త్ కేర్, ఐటీ తదితరాలు సహా హ్యుమానిటీస్‌లో కూడా విజ్ఞానం ఆధారిత అభివృద్ధి అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ పరిశోధ నలో భారత భాగస్వామ్యం క్షీణిస్తుండటం ఆందోళన కరం. 2002లో 2.3శాతం కాగా 2007 నాటికి అది 2.2శాతానికి పడిపోయింది. 2010 నాటికి సైంటిఫిక్ పబ్లికేషన్‌లో భారత గ్లోబల్ షేర్ 3.5శాతం ఉంటుందని ఇండియన్ రీసెర్చ్ అవుట్‌పుట్‌పై థామస్ ర్యూటర్స్ అధ్యయనం పేర్కొంది. మరోవైపు ఇదే కాలంలో చైనా గణనీయమైన పురోగతి సాధించింది. చైనా వాటా 14శాతం నుండి 21.2శాతానికి పెరిగింది. అమెరికాతో పోల్చితే భారత్‌లోని పీహెచ్‌డీల సంఖ్య సగం మాత్రమే ఉంది. చైనాలో పీహెచ్‌డీలు గణనీయంగా పెరగటం గమనార్హం. పీహెచ్‌డీల విషయంలో 2002లో భారత్-చైనా మధ్య పెద్ద తేడా లేదు. అయితే 2007 నాటికి చైనా శరవేగంగా దూసుకుపోయి భారత్‌ను వెనుక వదిలేసింది. ఇప్పుడు ఈ విషయంలో దాదాపుగా అమెరికా స్థాయికి అది చేరుకుంది. బ్రెజిల్ వంటి దేశాలు కూడా తమ రీసెర్చి అవుట్‌పుట్‌లను అధిక నిష్పత్తుల తో పెంచుకుంటున్నాయి. పరిశోధన విషయంలో భారత్ పుంజుకోవాల్సి ఉంది. తమ ఆర్ అండ్ డీని మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలతో సరిసమా నం గా తయారుచేసుకోవాల్సిన అవసరం ఉంది. యూని వర్సిటీ స్థాయి రీసెర్చి విద్యను విస్తృతపర్చు కోవాలి. తీవ్రతరం చేసుకోవాలి. భారీ ప్రభుత్వ పెట్టుబడులతోనే ఇదంతా సాధ్యపడుతుంది. పరిశోధ కులు కావాలనుకునే వారికి సాధ్యమైనంత ఎక్కువ తోడ్పాటు అందించాలి. చిన్న పరిశోధనా కేంద్రంగా మిగిలిపోకుండా విస్తృతంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలి. అయితే పైన పేర్కొన్న రెండు నిర్ణయాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇదంతా ఈఏడాది డిసెంబర్‌లో నైరోబీలో జరగనున్న డబ్ల్యూటీవో-జీఏటీఎస్ సమావేశానికి తయారీ తప్ప మరేమీ కాదనిపిస్తోంది.
ఏదిఏమైనా కేంద్రప్రభుత్వం ఆచరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు విజయవంతం కావనే ఆశిస్తున్నాం. యూజీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీల విద్యా ర్థులు ఆందోళన కు దిగారు. ఆందోళనకారుల్లో కేవలం రీసెర్చి, పీజీ విద్యార్థులే కాక అన్ని కోర్సులు, తరగతుల విద్యార్థులు ఉన్నారు. సెంట్రల్ వర్సిటీలే కాక రాష్ట్ర వర్సిటీల విద్యార్థులు కూడా యూజీసీకి వ్యతిరేకం గా నినదిస్తున్నారు. ఉద్యమాలకు కేంద్రంగా ఢిల్లీ మారింది. ’యూజీసీ ముట్టడి’ అన్నది ఆందోళన చిహ్నంగా ఆవిర్భవించింది. రాజకీయ, సిద్ధాంతాల ఆధారంగా నడిచే విద్యార్థి సంఘాలన్నీ ఐక్య ఉద్యమానికి నడుం బిగించాయి. యూజీసీ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఆందోళనను చెడగొట్టేందుకు ఏబీవీపీ ప్రయత్నిం చింది. వారు ఆందోళనలో పాల్గొనకపోవటాన్ని అర్థం చేసుకోగలం. అయితే విద్యార్థులంతా పూర్తి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో హెచ్ ఆర్‌డీ మంత్రితో సమావేశమై ఆందోళనను నీరుకార్చేం దుకు ఏబీవీపీ ప్రయత్నించింది. వారు మంత్రి ఇచ్చిన హామీలను గురించి చెప్పినప్పటికీ విద్యార్థులు వెనుకడుగు వేయలేదు.
జేఎన్‌యూఎస్‌సీ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, ఏఐడీఎస్‌ఓ బ్యానర్ల తో తమ ఉద్యమాన్ని ముందుకునడిపారు. రెండుసార్లు పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ.. విద్యార్థులు భయపడ లేదు… ఖాకీలకు తలవంచ లేదు. లాఠీచార్జిలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులతో పాటు ఇతర విద్యార్థి నేతలు తీవ్రంగా గాయపడ్డారు. రెండు వారాలకుపైగా విద్యార్థులు యూజీసీని ముట్టడిం చారు. ఉత్సాహంగా స్వచ్ఛందంగా వివిధ యూని వర్సిటీల విద్యార్థులు ఆందోళనలో భాగస్వాము లయ్యారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. కులం, మతం, వేషధారణ, ఆహారపు అల వాట్లు తదితరాల ఆధారం గా సమాజం విభజిం చబడుతున్న ఈ తరుణంలో ఈ ఆందోళనకారులు ఐకమత్యానికి ప్రతీకగా నిలిచారు. ఐక్యంగా పోరాడి విజయాన్ని సాధిస్తామన్న పూర్తి విశ్వాసంతో ముందుకుసాగుతున్నారు.ఈ ఆందోళన కు మద్దతు పలకటం ప్రగతిశీల, ప్రజాస్వామ్య వాదుల కనీస బాధ్యత.