Search
Wednesday 21 November 2018
  • :
  • :

అశ్వరావుపల్లి రిజర్వాయర్‌ను టూరిజం హబ్‌గా చేయండి

Rajaiah1

రఘునాథపల్లి: మండలంలోని అశ్వారావుపల్లి రిజర్వాయర్ ను టూరిజం హబ్‌గా ఏర్పాటు చేయాలంటూ స్టేషన్‌ఘణపురం ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్యకు హన్మకొండలోని తమ నివాసంలో బుదవారం టిఆర్‌ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు కుర్ర కమలాకర్ గౌడ్ తోపాటు సభ్యులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ జనగామ జిల్లాలోని అతి పెద్ద రిజర్వాయర్ అయిన పంగిడి చెరువును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడంతో పాటు బోటింగ్ ఏర్పాటు చేయడానికి అన్ని హంగులు వున్నాయని అన్నారు.

టూరిజంను ఆహ్లాద పరిచేందుకు పక్రృతి పరంగా రిజర్వాయర్ చుట్టూ ప్రకృతి సిద్ధమైన కొండలు, గుట్టలు, చుట్టు పచ్చని చెట్లు దట్టమైన అడవిలో ఈ రిజర్వాయర్ వుండడం వల్ల పక్రృతిని చూడడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారని, గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తుందని వారు వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ రాజయ్య సానుకులంగా స్పదించి ఈ విషయాన్ని టూరిజం అధికారుల దృష్టికి తీసకెళ్లి టూరిజం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని అన్నారని పేర్కొన్నారు. వినతి పత్రం అందించిన వారిలో కుర్ర రంజిత్ గౌడ్, గుర్రం జంపి, రాగం సాంబరాజు, గాజల రాజు, మండలి సంపత్, రమాకాంత్, ఇస్కిల్ల సంపత్, రాజు, ఆశోక్‌రెడ్డి, శ్రీకాంత్, కుమార్, ప్రశాంత్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments