Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఆలరించిన ఆశ్రమ బాలల సాంస్కృతిక ప్రదర్శన

Clutural-Programs

కరీంనగర్ : అభినయ కల్చరల్ ఆర్ట్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రెస్‌క్లబ్ ఆడిటోరియంలో కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం ఆశ్రమ బాలలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. దేశభక్తి గేయాలు, అమ్మ ప్రేమ, పాటల పోటీలు, జానపద గ్రూపు నృత్యపోటీలలో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన తబిత అనాథ ఆశ్రమం, అమ్మపరివార్ అనాథ ఆశ్రమం, యం.డి.హెచ్.డబ్లు.యస్ సంస్థల అనాథ బాలబాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక వారధి కోఆర్డినేటర్‌గా నియమితులైన దయానర్సింగ్‌ను ఘనంగా సన్మానించారు. నటరాజ్ మెమొంటో షాపు వారు అనాథ బాలబాలికలకు స్వీట్లు పంపిణీ చేశారు.

Comments

comments