Home జాతీయ వార్తలు గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ganta-Srinivasహైదరాబాద్ : ఎపి గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో ఎపి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 50 గురుకుల విద్యాలయాలు, 10 జూనియర్, 2 డిగ్రీ గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఐదో తరగతిలో 3960, జూనియర్ కళాశాలల్లో 14,25, డిగ్రీ కళాశాలల్లో 432 సీట్లలో ప్రవేశానికి ఈ పరీక్షలు నిర్వహించారు.