Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

గురుకులంలో దారుణం: నెలరోజులపాటు బాలుడిపై తోటి విద్యార్థుల లైంగిక దాడి

Rape

ములుగు: తోటి విద్యార్థుల అకృత్యాలు, అసాంఘీక చర్యలు ఓ విద్యార్థి జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ములుగులోని ఓ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు తమ కంటే చిన్నవాడైన ఆరో తరగతి చదువుతున్న మరో బాలుడిపై నెలరోజులపాటు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్ వాడకం ఆ విద్యార్థుల మనసులో విషజీజాలను నాటింది.

ప్రతిరోజు తమ వద్ద ఉన్న మొబైలల్లో నీలిచిత్రాలు చూస్తూ రాత్రి వేళలో తోటి విద్యార్థిపై వాటిని ప్రయోగించేవారు. ఈ తంతు గత నెలరోజులుగా జరుగుతుంది. అయితే బాధితుడు గత కొంతకాలంగా ముభావంగా ఉండడం గమనించిన హౌస్‌మాస్టర్ వాకాబు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. తనపై నెలరోజులపాటు జరిగిన అకృత్యాన్ని బాధితుడు మాస్టర్‌కు చెప్పాడు. దీంతో ఈ ఘాతుకానికి పాల్పడిన ఆరుగురు విద్యార్థులను పాఠశాల నుంచి బహిష్కరించారు.

Comments

comments