Home రాష్ట్ర వార్తలు 7306 గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్

7306 గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్

గత నిబంధనలను సవరిస్తూ 9 రకాల పోస్టులకు ఉత్తర్వులు
18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

tspsc

హైదరాబాద్: రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థల్లో బోధన, బోధ నేతర సిబ్బంది నియామకాలకు తొమ్మిది నోటిఫికేషన్లు విడుదలయ్యా యి. 7,306 పోస్టులకు సవరించిన నిబంధనలతో నోటిఫికేషన్లు జారీ చేసి నట్లు టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. ఈ పోస్టులకు ఈనెల 18వ తేదీ నుంచి దరఖాస్తు లు స్వీకరించనున్నట్లు తెలిపింది. గత ఫిబ్రవరి 6న గురుకుల పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో డిగ్రీ, పిజిల్లో 60 శాతం మార్కులు, బోధన అనుభవం ఉండాలని పేర్కొన్న నిబం ధనలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

నిరుద్యోగుల ఆందోళనలకు దిగొచ్చిన ప్రభుత్వం నిబంధనలు సడలించి గురు కుల నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయిం చడంతో టిఎస్‌పిఎస్‌సి ఆ నోటిఫికేషన్లను రద్దు చేసింది. గురువారం సవరించిన నిబంధనలతో 7,306 గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రకటించింది. ఇందులో పోస్టు గ్రాడ్యుయేట్ టీచరు ్ల(పిజిటి) 921, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ ర్లు (టిజిటి) 4,362, ఫిజికల్ డైరెక్టర్స్ (పాఠశాలలు) 6, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచ ర్లు (పిఇటి) 616, ఆర్ట్ టీచర్లు 372, క్రాఫ్ట్ టీచర్లు 43, మ్యూజిక్ టీచర్లు 197, లైబ్రేరియన్స్ (పాఠశాలలు) 256, స్టాఫ్ నర్స్ 533 పోస్టుల భర్తీ చేయనున్నారు.

గురుకుల ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశానికి ఈ నెల 18 నాటికి దరఖాస్తులు స్వికరిస్తున్నట్లు సంస్థ కార్య దర్శి శేషుకుమారి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ప్రకటన విడుదల చేశారు. మే 10న టిఎస్‌ఆర్‌జెసి-సెట్-2017 ప్రవేశపరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ దరఖాస్తులను tsrjdc.cgg. gov.iv ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.