Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోండి : నాయిని

Nayani-Narsimhareddy

హైదరాబాద్ : ప్రజలు తమ కాలనీల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కోఠిలోని ఇసామియా బజారులో 30 సిసి కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిసి కెమెరాలతో నగరంలో దోపిడీలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు చాలా భేషుగ్గా ఉందన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Comments

comments