Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మా రాజీనామాలు ఆమోదించండి: వైసిపి ఎంపిలు

YCP-MPs

ఢిల్లీ: బుధవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో వైసిపి ఎంపిలు సమావేశమయ్యారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని స్పీకర్‌ను వైసిపి ఎంపిలు కోరారు. రాజీనామాలను మరోసారి ధ్రువీకరిస్తూ లేఖలు పంపాలని సదరు ఎంపిలకు లోక్‌సభ స్పీకర్ సూచించారు. లోక్‌సభ స్పీకర్‌కు ధ్రువీకరణ లేఖ ఇవ్వాలని వైసిపి ఎంపిలు నిర్ణయం తీసుకున్నారు. వైసిపి ఎంపిలు మీడియాతో మాట్లాడారు. తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా మరోసారి లేఖలు ఇవ్వాలని స్పీకర్ సూచించారన్నారు. తమ రాజీనామాల విషయంలో పునరాలోచన లేదని స్పీకర్  కు చెప్పామన్నారు. మళ్లీ లేఖలు పంపిన తరువాత రాజీనామాలు ఆమోదిస్తామని స్పీకర్ చెప్పారని వివరించారు. గతంలో ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ వైెసిపి ఎంపిలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Comments

comments