Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సోషల్ మీడియా వార్తకు స్పందించి రక్తదానం

Blood

జగిత్యాలటవర్‌సర్కిల్ : ఓ మహిళకు అత్యవసర పరిస్థితిలో రక్తం కావాలంటూ బీసీ సమాఖ్య సభ్యులు వాట్సాప్‌లో పంపిన సందేశానికి కొందరు యువకులు స్పందించి రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ధర్మపురి మండల కేంద్రానికి చెందిన సుజాత అనే మహిళ ఆనారోగ్యానికి గురై చికిత్స కోసం కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు బి పాజిటివ్ రక్తం అవసం ఉందని, వెంటనే రక్తాన్ని సమకూర్చుకోవాలని వైద్యులు సూచించడంతో ఆమె బంధువులు బీసీ సమాఖ్య కన్వీనర్ ఉమామహేశ్‌ను సంప్రదించారు. దాంతో ఆయన వాట్సాప్‌లో బి పాజిటివ్ రక్తం అవసరముందని పేర్కొనడంతో స్పందించిన ధర్మపురికి చెందిన దూడ హరిప్రసాద్, కమలాపూర్‌కు చెందిన గర్షకుర్తి సాగర్, కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు బచ్చు తక్షక్‌రాజు, అన్నెడి నవీన్‌రెడ్డి, బైరి రాజ్‌కుమార్‌లు రక్తదానం చేసి మహిళ ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా వారిని సుజాత బంధువులు, ఆస్పత్రి వైద్యులు అభినందించారు.

Comments

comments