Home మహబూబ్‌నగర్ గ్రామ పంచాయతీలకు హరితహారం బాధ్యతలు అప్పగింత

గ్రామ పంచాయతీలకు హరితహారం బాధ్యతలు అప్పగింత

Responsibilities for the Gardening for Gram Panchayats

గ్రామ స్థాయిలో హరితహారం అమలే తమ లక్షం
అన్ని ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి
అధికారులకు, ప్రజా ప్రతినిధులకు హరితహారంపై శిక్షణ
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ :  నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేసి, గ్రామ పరిధిలో ఉన్న గుట్టలు, బంజరు భూములు, క్షీణించిన ఆటవీ భూములు, రోడ్లు, పరిసర ప్రాంతాలు చెరువు శిఖాలలో మొక్కలు నాటి గ్రామాన్ని పచ్చ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి అన్నారు.  బుధవారం తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటే బృహత్కర కార్యంలో  పంచాయతీలకు అప్పగించడం ద్వారా గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం సులభవుతుందన్నారు. గ్రామాల్లో రోడ్లు, నీటి వసతి ఉన్న చోట్ల  ప్రతి ఏటా 40 వేల మొక్కలను నాటేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని, అందుకు గ్రామ పంచాయతీలు బాధ్యత తీసుకోవాలన్నారు. అందుకు ఆటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు తమ వంతు సహకారాలు అందిస్తాయన్నారు. రాష్ట్ర స్థా యి శిక్షణ హైదరాబాద్‌లో ఆటవీ శాఖకు చెందిన అకాడమీలో  శిక్షణా శిబిరం నిర్వహించి సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నా రు. నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే శిక్షణలో ఎంపీడీఓ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామాల్లో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయసుకోవాలని అందుకు నిధులు విడుదల చేశామన్నారు. రాబోయే వారం పది రోజుల్లో నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసిన గతంలో చేసిన నిర్మాణాలకు కూడా చెల్లింపులు చేయాలన్నారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్ధేశించిన తేదీ ప్రకారం హరితహారం ప్రారంభిస్తామని, అందుకు అన్ని ఏర్పా ట్లు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి,  చిట్టెం రామ్మోహన్‌రెడ్డి,   రాజేందర్‌రెడ్డి, డీఆర్‌డీఓ పిడి వెంకట్ ఉపేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.