Home దునియా గలగలపారుతున్న గంగకత్వ

గలగలపారుతున్న గంగకత్వ

Restoration of Gangakathwa Canal in Telangana

రాజవంశాలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల  జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు శతాబ్దాల క్రితమే తెలంగాణ లో చెరువులను నిర్మిస్తే 60 ఏళ్ళ సమైఖ్య పాలనలో  శతాబ్దాల చెరువులు  ధ్వంసం అయ్యాయి. ఈ ధ్వంసానికి   చెరువులే సాక్షం చెబుతున్నాయి. మిషన్ కాకతీయకు పూర్వం చెరువులు ఎండిన ఎడారులను తలపించాయి.  తెలంగాణ ఆవిర్భావం అనంతరం చెరువుల పూడికతీతతో జలాశయాలకు పూర్వవైభవం పులుముకుంటుంది. దీనికి తార్కాణంగా ఆరూర్ శివారు గ్రామంలోని గంగకత్వ కాలువ ఓ ఉదాహరణ. కాకతీయ రాజులు జలవనరులు పెంపొందించేందుకు చెరువులు, కాలువలు, బావులు తవ్వించి తెలంగాణను సస్యశ్యామలమైన వ్యవసాయ క్షేత్రంగా మలిచారు. అదే ఆనవాయితీని అనంతర రాజులు పాటించి చెరువుల తవ్వకాలు, కత్వాల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.  హైదరాబాద్ సంస్థానాన్నిసుదీర్ఘ కాలం పరిపాలించిన ఆసఫ్‌జాహీలు జలవనరులకు ఇచ్చిన ప్రాధాన్యతకు గంగకత్వ  సాక్షం చెబుతోంది.

1948 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన జలవనరుల్లో గంగకత్వకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గొలుసుకట్టు చెరువులకు నీరు సమృద్ధిగా అందించేందుకు నిర్మించిన కాలువ గంగకత్వ.   నల్లచెరువు, ఎర్రకుంట, రావులచెరువు, మలహరికుంట, ఎన్నపల్లి, వెంకటాపూర్, మోగలి చెరువులను అనుసంధానం చేస్తూ పంటచేలకు నీరు అందించేందుకు నిర్మించిందే గంగకత్వ.  సుదూరదృష్టితో నిజాం రాజులు నిర్మించిన ఈ కత్వా సమైఖ్యపాలనలో ముళ్ళపొదలతో నిండిపోయింది. ఎక్కడికక్కడ కుదించుకుపోయింది. అయితే మిషన్ కాకతీయలో చోటుదక్కించుకున్న ఈకత్వా పునర్ వైభవంతో కళకళలాడుతోంది.  ఆరు గ్రామాల్లోని 11 చెరువుల్లో  నీరు నింపుతోంది. 13 వందల ఎకరాల ఆయకట్టుకు నీరు ఆందించేందుకు సిద్ధమైంది. 60 ఏళ్ల క్రితం సాగుకు నీరు అందించిన ఈ కాలువ తిరిగి యేసంగికి నీరు అందించడంతో రైతుల్లో ఆనందం తొణికిసలాడుతుంది. గత వర్షాలకు అలుగులు పారడంతో రైతులు కాలువ నుంచి నీరు తీసుకుని పంటలు పండించి వంలాది సంవత్సరాల వైభవాన్ని నెమరు వేసుకుంటున్నారు.