Home తాజా వార్తలు 27వేల చెరువుల పునరుద్ధరణ…

27వేల చెరువుల పునరుద్ధరణ…

Mission Kakatiya

 

హైదరాబాద్: మిషన్ కాకతీయ నాలుగు దశల్లో 27,645 చెరువులను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇందులో కొన్ని చెరువుల పూడిక తీత పనులు ఇంకా జరుగుతున్నా, అధిక భాగం చెరువులు పూడిక తీయడం పూర్తయ్యింది. ఇంకా 6000 చెరువుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వీటి గడువు కూడా మరో రెండు నెలల్లో ముగియనుంది. ఇందుకోసం రూ.8709 కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వగా, రూ.5540 కోట్ల పనులకు ఒప్పందాలు అయ్యాయి.

మొత్తంగా రూ.4 వేల కోట్లకు పైగా మిషన్ కాకతీయ పనులకు, అంటే కేవలం చెరువుల పునరుద్ధరణకే ప్రభుత్వం విడుదల చేసింది. మిషన్ కాకతీయ మొదటి దశలో 7970 చెరువులు, రెండో దశలో 8936 చెరువులు, మూడో దశలో 6096 చెరువులు పునరుద్ధరించారు. నాలుగో దశలో 4643 చెరువుల పనులకు టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో 45 వేలకు పైగా చిన్న, పెద్ద చెరువులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో కొన్ని చిన్న చెరువులు, కుంటల కింద కేవలం 40 నుంచి 50 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉంది.

అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు 100 ఎకరాల కంటే అధిక ఆయకట్టు కలిగిన చెరువుల్లో దాదాపుగా పునరుద్ధరించింది. 27,645 చెరువుల పూడిక తీత పూర్తయితే 21.24 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చు. 1.25 లక్షల ఎకరాల మాగాణంగా ఉన్న తెలంగాణలో 21 లక్షల ఎకరాలకు చెరువులే ఆదెరువుగా మారాయి. ఈ చెరువుల్లో 2415 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీయగా, 8.53 టిఎంసిల మేర అదనపు నీటి నిల్వను రాష్ట్రంలో సాధించినట్లయింది. ఈ అదనపు నీటి నిల్వనే 21 లక్షల ఎకరాలను కాపాడుతుందని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.

Restoration of Ponds by Mission Kakatiya