Home ఆఫ్ బీట్ కట్టుబాటు తప్పిన పరీక్షలపై గట్టి నిఘా

కట్టుబాటు తప్పిన పరీక్షలపై గట్టి నిఘా

health

తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడా, మగా ఎవరో ముందు గా తెలుసుకుని గర్భవిచ్ఛిత్తికి పాల్పడే ఘోరాలకు అడ్డుకట్టవేయడానికి ఎన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నా ఆగడం లేదు. లింగనిర్థారణ పరీక్షలపై ఆంక్షలు విధిస్తూ చట్టం వచ్చి 20 ఏళ్లయింది. అయినా యధాప్రకారం పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిసిపిఎన్‌డిటి (తెలంగాణ స్టేట్ ప్రి కన్సెప్షన్ అండ్ ప్రి నాటల్ డయాగ్నస్టిక్స్ యాక్ట్ పిసిపిఎన్‌డిటి) సెల్‌అధికార యంత్రాంగం కొత్త ప్రక్రియను చేపట్టింది. ఎక్కడయితే అక్రమంగా ఈ లింగనిర్థారణ పరీక్షలను నిర్వహిస్తున్నారో వారిని కనిపెట్టి సాక్షాలతో సహా సమాచారం అందించిన వారికి భారీ ఎత్తున నగదు బహుమతులను ఇవ్వడానికి నిర్ణయించింది. అటువంటి డయాగ్నస్టిక్ సెంటర్‌ల సమాచారం అందించిన వారికి లక్ష రూపాయలు, గర్భిణిలా నటించి ఆ డయాగ్నస్టిక్ సెంటర్ వద్దకు వెళ్లిన వారికి లక్ష రూపాయలు, ఆ గర్భిణికి తోడుగా వెళ్లిన సహాయకులకు రూ.50వేలు వంతున మొత్తం 2.5లక్షల రూపాయలు బహుమతిగా అందచేస్తారు. అక్రమంగా నిర్వహించిన పరీక్ష తాలూకు వీడియో సాక్షం కూడా పొందుపరచవలసి ఉంటుంది. ఇదివరకు ఈ నగదు బహుమతులు ఐదువేల రూపాయలనుండి 15 వేలు వరకే ఉండేది. ఇప్పుడు 650 శాతం మేరకు పెరిగింది. దీనివల్ల గర్భస్థ అక్రమ పరీక్షలు ముఖ్యంగా భ్రూ ణహత్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుం చో ఇతర రాష్ట్రాలు భారీ మొత్తంలో నగదు బహుమతులు అందించ డం పరిపాటిగా వస్తోంది. రాజస్థాన్‌లో ముఖ్‌బీర్ యోజన కింద 2012 నుంచి రూ.2.5లక్షలు ఇస్తున్నారు. తెలంగాణ పిసిపిఎన్‌డిటి సెల్ అధికార యంత్రాంగం ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు పంపించిన ప్రతిపాదన ఆమోదం పొం దింది. నగదు బహుమతుల విలువను పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇ చ్చింది. నిందితులను ఉచ్చులో బిగించే ఈ ఆపరేషన్లు అయిదు కన్నా ఎక్కువగా జయప్రదమయితే నిధులు కావాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తామని అధికారులు చెప్పారు. ఈ ఆపరేషన్‌కు ఎవరిని ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎవరు వారిని ఎంపిక చేస్తారు, గర్భిణిగా నటించే కపటధారికి ఏ స్థాయిలో సెక్యూరిటీ కల్పించాలి, సహాయకులుగా ఎవరిని పంపాలి, తదితర అంశాల ప్రాతిపదికగా అధికారులు మార్గదర్శకాలు రూపొందించవలసి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు రాష్ట్రప్రభుత్వ ఆమోదం కోసం పంపాలి. ఆమోదం పొందిన తరువాత వాటిని ప్రజల ముందుకు తీసుకు వస్తారు. నగదు బహుమతుల విధానం ప్రజలందరికీ తెలియచేస్తారు.
గత ఏప్రిల్‌లో హైదరాబాద్ పోలీ స్ టాస్క్‌ఫోర్స్ ఒక గర్భిణీ సహకారంతో ఒక ఆ స్పత్రి గుట్టును బయటపెట్టగలిగారు. అక్రమంగా లింగ నిర్థారణ పరీక్షలు చేస్తున్న బండా రం బయటపెట్టి స్కానింగ్ సెంటర్‌ను, ఆస్పత్రిని మూసివేయించారు. జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీస్ సిబ్బంది డయాగ్నస్టిక్ సెంటర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, రికార్డులు నిర్వహించనందుకు షో కాజ్ నోటీస్‌లు జారీ చేశారు. అయి తే అన్ని కేసులూ కోర్టువరకు వెళ్లలేదు. అయితే న్యాయశాస్త్రం చదివిన వారిని జిల్లా ప్రో గ్రాం కో ఆర్డినేటర్లుగా నియమిస్తే వారు కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తారు. దీనికితో డు చట్టాన్ని కూడా అమలు చేయగలుగుతారు. గతంలో డయాగ్నస్టిక్ సెంటర్లు రికార్డులు నిర్వహించలేదని 19 కేసులు నమోదయ్యాయి. గర్భస్థ శిశువు లింగనిర్థారణ పరీక్షలకు సంబంధించి 2కేసులే దాఖలయ్యాయి. హెల్త్ డిపార్టుమెంట్‌లో రిజిస్టర్ చేయనందుకు ఆ క్లినిక్‌పై 3కేసులు నమోదయ్యాయి. మూ డు కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి.
(పిసిపిఎన్‌డిటి ప్రోగ్రెస్‌రిపోర్టు)
పిసిపిఎన్‌డిటి చట్టానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలంగాణ మూడునెలలు ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేసింది. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కోర్టులో పోలీసులు దాఖలు చేసిన కేసులు 24 గా పేర్కొన్నారు. చట్టం అమలులోకి వచ్చిన దగ్గరనుంచి 2018 మార్చి వరకు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలుగా అధికారులు పేర్కొన్నారు. 108 యం త్రాలను సీజ్ చేసినట్లు చెప్పారు. హర్యానా రాష్ట్రంలో ఎక్కువగా 537 యంత్రాలను, ఆంధ్రప్రదేశ్‌లో 15 యంత్రాలను సీజ్ చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు 10 జిల్లాలకు సంబంధించి పిసిపిఎన్‌డిటి జిల్లా ప్రో గ్రాం కో ఆర్డినేటర్లను నియమించడానికి అనుమతి లభించినట్లు అధికారులు చెప్పారు. అంతకుముందు అయిదు జిల్లాల్లో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటయ్యాయి. నల్గొండలో 2015 సెప్టెంబర్‌లో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటయినా కమిటీ సభ్యులు సమావేశం సరిగ్గా జరగడం లేదు. గత 17 ఏళ్లలో ఈ చట్టాన్ని ఉల్లంఘించిన కేసులు తెలంగాణలో కేవలం 20 మాత్రమే. రాష్ట్రంలో రిజిస్టర్ కాని క్లినిక్ కేసులు ఒకటి, రెండు మాత్రమే తమ దృష్టికి వచ్చాయని 201617 లో 8 జిల్లాలకు సంబంధించి 16 సెంటర్లకు తమ విభాగం నోటీసులు జారీ చేసిందని ప్రాజెక్టు డైరెక్టర్ వెల్లడించారు. జాతీయ నేరాల రికార్డు బ్యూరో నివేదిక కూడా 2016 లో ఎలాం టి లింగ విచక్షణ నిర్థారణ జరగలేదని, గర్భస్థ పిండ విచ్ఛిత్తి జ రిగినట్లు ఏ ఒక్క కేసు నమోదు కాలేదని చెబుతోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 2016 వార్షిక నివేదికలో నమోదయిన 32 కేసులు కోర్టు విచారణలో పెండింగ్‌లో ఉన్నట్టు తేలింది.
(బేటీబచావో, బేటీ పడావో)
ఆడబిడ్డలసంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం బేటీబచావో, బేటీ పడావో పథకాన్ని అమలులోకి తెచ్చింది. 300 కోట్ల రూపాయలతో 29 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. హర్యానాలో గతంలో వెయ్యిమంది అబ్బాయిలకు 758 మంది అమ్మాయిలు ఉండగా, ఇప్పుడు 884కి సంఖ్య పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. తమిళనాడు కడలూరులో 856 నుంచి 957 కు, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో 899 నుండి 977 వరకు అమ్మాయిల సంఖ్య పెరిగింది. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కువసంఖ్యలో ప్రసవాలు జరుగుతున్నా ఆ వివరా లు రికార్డు కావడం లేదు.
ఆడబిడ్డ పుట్టగానే ఆధార్ మాదిరిగా ప్రత్యేక సంఖ్య కేటాయించి 15 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ప్రభుత్వ సంక్షేమపథకా లు ఏ విధంగా అందుతున్నాయో పర్యవేక్షించాలని తెలుగు రాష్ట్రాలకు రెండేళ్ల క్రితం హైకోర్టు సూచించింది. ఈ పథకం లక్షం నెరవేరాలంటే రాష్ట్రంలో కూడా ఇందులో తగిన బాధ్యతల భాగస్వామ్యం కల్పించవలసిన అవసరం ఉంది.
ఆడపిల్లల భద్రతకు కొత్తపథకం
నల్లగొండజిల్లా దేవరకొండ డివిజన్ గిరిజన ప్రాంతాల్లో ఆడబిడ్డలను అమ్మివేయడం, చంపడం వంటి దురాగతాలు 1999 లో వెలుగులో కి వచ్చాయి. దాంతో రాష్ట్రప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి వ్యవసాయ బోరు బావులు తవ్వించడం, మో టార్లు మంజూరు చేయడం, సబ్సిడీపై గొర్రెల పంపిణీ తదితర చర్య లు చేపట్టింది. ఈ జిల్లాలోని ఆడబిడ్డలను ఆదుకోవడానికి ప్రయోగాత్మకంగా టేపయోగాత్మకంగా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించింది. దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించడమే కాక ఆడబిడ్డ చదువుకు, పెళ్లీడు వచ్చేవరకు ఆర్థిక ప్రయోజనం
కలుగుతుంది.
మన తెలంగాణ, పరిశోధన విభాగం