Home అంతర్జాతీయ వార్తలు రేపటి నుంచి ఇరాన్‌పై ఆంక్షలు : ట్రంప్

రేపటి నుంచి ఇరాన్‌పై ఆంక్షలు : ట్రంప్

Trump allies push White House to consider regime change in Tehran

వాషింగ్టన్ : నవంబర్ 5 నుంచి ఇరాన్‌పై తమ ఆంక్షలు అమలవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆంక్షలు ఉంటాయని, ఇరాన్  అవినీతి  ప్రభుత్వంపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. రెండేళ్ల క్రితం తాను అధికారం చేపట్టినప్పటి ఇరాన్‌కి ప్రస్తుత ఇరాన్‌కు చాలా తేడా ఉందని చెప్పారు. ఇరాన్‌తో అణు ఒప్పందం చాలా దారుణమైనదని, గతంలో ఇటువంటి ఒప్పందం ఏ దేశంతోనూ ఎప్పుడూ చేసుకోలేదని, అందుకే ఈ ఒప్పందాన్ని  రద్దు చేశానని ట్రంప్ తెలిపారు.

అప్పటి నుంచి ఇరాన్ చాలా దారుణంగా ప్రవర్తిస్తోందని చెప్పారు. ఇరాన్ మీద విధిస్తున్న ఆంక్షలు చాలా కఠినమైనవని, అవి చాలా పెద్ద ఆంక్షలని, టెహరాన్ నుంచి వారిని ఏరివేస్తామని తెలిపారు. 2015లో అమెరికా, ఇరాన్ మధ్య  జాయింట్ కాంప్రెహెన్సీవ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒప్పందం జరిగింది. ఆర్థిక ఆంక్షలను సడలించినట్లయితే తాము అణు కార్యకలాపాలు నిలిపివేస్తామని ఐదుగురు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్యులు, జర్మనీ, ఇరాన్ మధ్య ఒప్పందం చోటు చేసుకుంది. ఈ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న తరువాత తాజాగా ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. అణ్వాయుధాల తయారీలో టెహరాన్‌కు ఏ దేశం కూడా సహకరించకూడదని హెచ్చరించింది. ఐతే తాము శాంతియుత జీవనం కోసమే అణ్వాయుధాల కార్యక్రమాలు చేపట్టామని ఇరాన్ ప్రకటించింది. వెస్ట్ వర్జీనియా దగ్గర ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ఇరాన్ మీద కఠినమైన ఆంక్షలు విధించానని తన మద్దతుదారులకు చెప్పారు. ఇరాన్ నుంచి ఏ దేశం చమురుని దిగుమతి చేసుకోవద్దన్నదే తమ పాలసీ అని తెలిపారు. తాము తలపెట్టిన ప్రాజెక్టుల వల్ల డిమాండ్ కన్నా అధికంగా చమురు లభిస్తుందని, అప్పుడు ఇరాన్ నుంచి ఏ దేశం దిగుమతి చేసుకోవాల్సిన అసరముండదని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

ఆంక్షలు ఎత్తివేయకపోతే మళ్లీ అణుదారే

Negotiations, America, North Korea

సియోల్ : అమెరికా మాట ఇచ్చినట్లుగా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయకపోతే తమ దేశ అణ్వాభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధరించుకుంటామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. తమ దేశ మునుపటి అణు ఒప్పంద పరిధిలోనే వెళ్లాల్సి ఉంటుందని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన వెలువరించింది. ఉత్తర కొరియా పూర్తి స్థాయిలో తమ అణు కార్యక్రమాలను వదులుకోవడంలేదని, అంతవరకూ ఆంక్షలు సంపూర్ణ స్థాయిలో ఎత్తివేయడం కుదరని ట్రంప్ అధికార యంత్రాంగం పేర్కొనడం ప్రకంపనలకు దారితీసింది.

అయితే ఆంక్షలు ఎత్తివేయకపోతే తమ అణు కార్యక్రమాల కొనసాగింపు ఉంటుందని ఉత్తర కొరియా పేర్కొనడంతో ఇరుదేశాల మధ్య తిరిగి అపనమ్మక వాతావరణం ఏర్పడింది. ఎడమొహం పెడమొహం వైఖరి ప్రస్పుటం అయింది. తమ పట్ల అమెరికా వైఖరిలో పూర్తి స్థాయి మార్పు రాకపోతే తాము ప్యోంగిజిన్ పాలసీతో తిరిగి వెళ్లాల్సి ఉంటుందని  ఉత్తర కొరియా వెలువరించిన ప్రకటనలో వివరించారు. ఈ పాలసీ పరిధిలో దేశం తమ అణు శక్తిని పెంపొందింపచేసుకోవడంతో పాటు ఆర్థిక ప్రగతికి సొంత చర్యలు తమకు అనుగుణంగా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అమెరికాతో ప్రస్తుతం సాగుతోన్న అణు చర్చల నుంచి వైదొలగడం జరుగుతుందని ఉత్తర కొరియా ఈ విధంగా సంకేతాలు వెలువరించింది. సింగపూర్‌లో ట్రంప్  కిమ్ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందానికి తూట్లు ఏ స్థాయిలో దొర్లుతున్నాయి? అనేది వెల్లడవుతూనే ఉందని ఉత్తర కొరియా విమర్శించింది. అణు ముప్పు లేని కొరియా ద్వీపకల్ప స్థాపన ఉంటుందని ట్రంప్ పేర్కొనడం వరకూ బాగానే ఉంది కానీ,  ఇది ఏ విధంగా ఏ స్థాయిలో సాధ్యం అవుతుందనేది ఇప్పటికీ స్పష్టం కాలేదని ప్రకటనలో తెలిపారు. ఆంక్షలు పలు రకాల దౌత్య ఒత్తిళ్లతో అమెరికా తాను అనుకుంటున్నట్లుగా అణ్వస్త్ర నిరాయుధీకరణను స్థాపించుకోవచ్చునని అనుకుంటున్నట్లు ఉందని, అయితే ఇటువంటి వెకిలి ఆలోచనల పట్ల తాము నవ్వుకోవడం తప్ప మరోటి చేయలేమని ఈ ప్రకటనలో తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు.

Restrictions on Iran Said by Trump

Telangana news