Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఉత్తర కొరియాపై కఠిన ఆంక్షలు తప్పవు : పెన్స్

int

టోక్యో: త్వరలో ఉత్తర కొరియాపై ‘కఠిన ఆంక్షలు’ విధించడం తప్పదని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బుధవారం  చెప్పారు. ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా ‘హైజాక్’ చేయడాన్ని అనుమతించబోమని కూడా హెచ్చరించారు. దక్షిణ కొరియా శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరవ్వడానికి వెళుతున్న ఆయన జపాన్‌లో ఈ విషయాన్ని చెప్పారు.  ఉత్తర కొరియా ఆంక్షల విధింపు విషయంలో జపాన్‌తో కలసి పనిచేస్తున్నామన్నారు. వివరాలు తెలుపకుండానే ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని మైక్ పెన్స్ తెలిపారు.  అమెరికా, ఉత్తర కొరియా మధ్య మాటాల యుద్ధం ఇప్పటకీ తీవ్రంగానే ఉంది. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా అణ్వాయుధ దేశంగా ఉండడాన్ని అమెరికా, జపాన్  ఆమోదించబోవని  జపాన్  ప్రధాని షింజో అబె అన్నారు. జపాన్ గుండా దక్షిణ కొరియాకు బయలు దేరిన మైక్ పెన్స్ శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభోతవంలో ఉత్తర కొరియా ప్రతినిధి బృందంతో సమావేశం కూడా కాబోనని స్పష్టం చేశారు. ‘నేనైతే వారితో సమావేశాన్ని కోరలేదు. కానీ అక్కడ ఏమి జరగనుందో వేచి చూద్దాం’ అన్నారు.  అయితే ఒలింపిక్ గేమ్స్‌ను ఉత్తర కొరియా హైజాక్ చేయకుండా చూసే సందేశం ఇవ్వాలని టోక్యో కఠిన వైఖరిననుసరిస్తోంది.

Comments

comments